Maruti: కాంపాక్ట్‌ ఎస్‌యూవీ ఫ్రాంక్స్‌ను విడుదల చేసిన మారుతి సుజుకీ

కొత్త కాంపాక్ట్‌ ఎస్‌యూవీ ఫ్రాంక్స్‌ను మారుతి సుజుకీ నేడు మార్కెట్లో విడుదల చేసింది.

Updated : 25 Apr 2023 00:48 IST

మారుతి సుజుకీ తన సరికొత్త కాంపాక్ట్‌ ఎస్‌యూవీ, ఫ్రాంక్స్‌ను నెక్సా ద్వారా విడుదల చేసింది. ఫ్రాంక్స్‌ ప్రారంభ ధర రూ.7.46 లక్షలు- 13.13 లక్షలు (దిల్లీ ఎక్స్‌ షోరూం). మారుతి సుజుకీ, ఆటో ఎక్స్‌పో 2023లో ఫ్రాంక్స్‌ను ఆవిష్కరించింది. కొత్తగా విడుదల చేసిన కాంపాక్ట్‌ ఎస్‌యూవీ.. మారుతున్న కస్టమర్‌ డిమాండ్‌లను పరిష్కరించే ఆలోచనతో రూపొందించారు. ఇది యువ ట్రయల్‌బ్లేజర్‌లను లక్ష్యంగా చేసుకుని విడుదల చేసినట్లు మారుతి సుజుకీ ఇండియా మార్కెటింగ్‌ ప్రతినిధి తెలిపారు. ఈ కారు 22.89 KM/L వరకు ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. ఫ్రాంక్స్‌ను మారుతి సుజుకీ సబ్‌స్క్రిప్షన్‌ ఫీజుతో కూడా ఉపయోగించుకోవచ్చు. రూ.17,378 నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ ఫీజు చెల్లించడం ద్వారా వినియోగదారుడు కొత్త కారును కొనుగోలు చేయకుండానే ఉపయోగించుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని