Moto G13: ₹10 వేలకే మోటో జీ13.. 5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరా
Moto G13: ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌తో వస్తోన్న ఈ Moto G13 ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ ఉంది.
Moto G13 | ఇంటర్నెట్ డెస్క్: ‘జీ’ సిరీస్‌లో మోటోరోలా మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. మోటో జీ13 పేరిట వస్తున్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌తో వస్తోంది. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ ఉంది. అయితే, ఇది 4జీ సపోర్ట్ చేసే ఫోన్ కావడం గమనార్హం. దీని ధర రూ.9,999. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసే వారికి ఐదు శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇది గతంలోనే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. తాజాగా భారత్‌లో విడుదల చేశారు. ఏప్రిల్ 5 నుంచి ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభమవుతాయి.
మోటో జీ13 స్పెసిఫికేషన్లు..
- 4జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- 90Hz రీఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ తెర
- వెనుక భాగంలో 50ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ కెమెరా
- సెల్ఫీల కోసం ముందుభాగంలో 8 ఎంపీ కెమెరా
- 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.