Motorola: మోటో నుంచి కొత్త 5జీ ఫోన్‌.. ధర, ఫీచర్లు ఇవే..!

Moto G34 5G: నూతన సంవత్సరంలో మోటోరోలా కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ని తీసుకొచ్చింది. బడ్జెట్ ధరలో ఈ మొబైల్‌ని ప్రవేశపెట్టింది.

Published : 09 Jan 2024 20:41 IST

Moto G34 5G | ఇంటర్నెట్‌డెస్క్‌:  ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ మోటోరోలా (Motorola) కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. మోటో జీ34 5జీ (Moto G34 5G) పేరుతో దీన్ని తీసుకొచ్చింది. 50ఎంపీ ప్రధాన కెమెరా, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయంతో బడ్జెట్‌ ధరలో దీన్ని తీసుకొచ్చింది. మైక్రో ఎస్‌డీ కార్డ్‌ ద్వారా స్టోరేజీని 1 టీబీ వరకు పెంచుకోవచ్చని కంపెనీ తెలిపింది.

మోటో జీ34 5జీ (Moto G34 5G) ఫోన్‌ రెండు వేరియంట్స్‌లో వస్తోంది. 4జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.10,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+ 128జీబీ వేరియంట్‌ ధర రూ.11,999గా కంపెనీ పేర్కొంది. చార్‌కోల్ బ్లాక్, ఐస్ బ్లూ, ఓషన్ గ్రీన్ రంగుల్లో ఫోన్‌ లభిస్తుంది. జవనరి 17 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయని తెలిపింది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు అన్ని రిటైల్‌ దుకాణాల ద్వారా కొనుగోలు చేయొచ్చని కంపెనీ వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్‌ ఎక్స్ఛేంజీ ఆఫర్‌ సాయంతో కొనుగోలు చేస్తే రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది.

ప్రారంభమైన జ్యోతి సీఎన్‌సీ ఐపీఓ.. పూర్తి వివరాలివే..!

ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే..  ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. 120Hz రిఫ్రెష్‌ రేటుతో వస్తోంది. అక్టా కోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 695 ప్రాసెసర్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్‌ 13తో ఈ స్మార్ట్‌ ఫోన్‌ పనిచేస్తుంది. ఇందులో మూడు కెమెరాలు ఇచ్చారు. వెనుక వైపు 50 ఎంపీ ప్రధాన కెమెరా, 2 ఎంపీ రియర్‌ కెమెరా, సెల్ఫీ కోసం ముందు వైపు 16 ఎంపీ కెమెరా ఇచ్చారు. 5,000mAh బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్ 20W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. వైఫై 802.11, బ్లూటూత్‌, 3.5mm ఆడియో జాక్‌, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌ వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని