Nothing Phone 2a: ₹24వేలకే నథింగ్‌ ఫోన్‌.. 2ఏ విశేషాలు ఇవీ..

Nothing Phone 2a lauched: నథింగ్‌ ఫోన్‌ 2ఏ విడుదలైంది. దీని ధర రూ.23,999 నుంచి ప్రారంభం అవుతుంది. మార్చి 12 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

Published : 06 Mar 2024 00:36 IST

Nothing Phone 2a | ఇంటర్నెట్‌ డెస్క్‌: నథింగ్‌ (Nothing).. పేరుకు లాంచ్‌ చేసినవి రెండే రెండు ఫోన్లైనా కావాల్సినంత ప్రచారం పొందిందీ కంపెనీ. వన్‌ప్లస్‌ సహ వ్యవస్థాపకుడైన కార్ల్‌ పై స్థాపించిన బ్రాండ్‌ ఇదీ. ట్రాన్సపరెంట్‌ లుక్‌లో లాంచ్‌ నథింగ్‌ ఫోన్‌ 1, 2 .. ఇప్పటికే మంచి మార్కులు కొట్టేశాయి. ధరే కాస్త అధికంగా ఉండడంతో చాలామంది అటువైపు చూడలేదు. దీంతో మిడ్‌ రేంజ్‌లో ఆ కంపెనీ ఓ ఫోన్‌ తీసుకొచ్చేందుకు ప్లాన్‌ చేస్తోందని ఎప్పటినుంచో వార్తలు వచ్చాయి. తాజాగా నథింగ్‌ ఫోన్‌ 2ఏ (Nothing Phone 2a) పేరిట ఓ ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది.

నథింగ్‌ ఫోన్‌ 2ఏ మూడు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ + 128జీబీ వేరియంట్‌ ధర రూ.23,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+256జీబీ వేరియంట్‌ రూ.25,999 గానూ; 12జీబీ+ 256జీబీ వేరియంట్‌ ధర రూ.27,999గానూ పేర్కొంది. మార్చి 12 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. లాంచ్‌ ఆఫర్‌ కింద తొలిరోజు కొనుగోలు చేసేవారికి రూ.19,999కే ఈ ఫోన్‌ను అందిస్తామని కంపెనీ ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డు ద్వారా రూ.2వేలు, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కింద మరో రూ.2వేలు చొప్పున తగ్గింపు పొందొచ్చు.    నో-కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. బ్లాక్‌, వైట్‌ కలర్స్‌లో లభిస్తుంది.

Swiggy: రైలు ప్రయాణికులకు స్విగ్గీ ఫుడ్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఈ స్టేషన్లలోనే

ఫోన్‌ స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే.. ఇది ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత నథింగ్‌ ఓఎస్‌ 2.5తో పనిచేస్తుంది. మూడేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్‌, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ లభిస్తాయి. 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇచ్చారు. 30Hz నుంచి 120Hz రిఫ్రెష్‌ రేటుతో ఈ డిస్‌ప్లే పనిచేస్తుంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌తో వస్తోంది. 1300 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఉంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 7200 ప్రో ప్రాసెసర్‌ను అమర్చారు.

వెనకవైపు డ్యూయల్‌ కెమెరా సెటప్‌ ఉంది. 50 ఎంపీ+ 50 ఎంపీ చొప్పున రెండు కెమెరాలు అమర్చారు. ముందువైపు 16 ఎంపీ కెమెరా ఉంది. 5జీ, వైఫై 6, బ్లూటూత్‌ 5.3, NFC, యూఎస్‌బీ టైప్‌-సి ఇచ్చారు. ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అమర్చారు. ఛార్జింగ్ కేబుల్‌ మాత్రమే ఇస్తారు. అడాప్టర్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 45W ఫాస్ట్‌ఛార్జింగ్‌కు ఈ ఫోన్ సపోర్ట్‌ చేస్తుంది.

నథింగ్‌ బడ్స్‌, నెక్‌ బ్యాండ్‌

నథింగ్‌ సబ్‌ బ్రాండ్ సీఎంఎఫ్‌ ఈ సందర్భంగా రెండు కొత్త ఆడియో ఉత్పత్తులను విడుదల చేసింది. సీఎంఎఫ్‌ బడ్స్‌, నెక్‌బ్యాండ్‌ ప్రోను తీసుకొచ్చింది. ఈ రెండూ మార్చి 6 నుంచి ఫ్లిప్‌కార్ట్, మింత్రాలో లభిస్తాయి. బడ్స్‌ ధరను రూ.2,499గా కంపెనీ నిర్ణయించింది. 42db నాయిస్‌ క్యాన్సిలేషన్‌తో ఈ బడ్స్‌ వస్తున్నాయి. సింగిల్‌ ఛార్జ్‌తో 8 గంటల పాటు పనిచేస్తాయి. ఛార్జింగ్‌ కేసు 35.5 గంటల బ్యాకప్‌ ఇస్తుంది. నెక్‌బ్యాండ్‌ ప్రో ధర రూ.1999గా నిర్ణయించింది. హైబ్రిడ్‌ ఏఎన్‌సీ టెక్నాలజీ, 50db నాయిస్‌ క్యాన్సిలేషన్‌తో దీన్ని తీసుకొచ్చింది. ఐపీ55 వాటర్‌, స్వెట్‌, డస్ట్‌ రెసిస్టెన్స్‌తో వస్తోంది. సింగిల్‌ ఛార్జ్‌తో 37 గంటల పాటు పనిచేస్తుంది. 10 నిమిషాల ఛార్జింగ్‌తో 18 గంటల పాటు వీటిని వినియోగించుకోవచ్చని కంపెనీ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని