Poco C50: ₹7 వేలకే పోకో కొత్త ఫోన్.. ఫీచర్లివే..
పోకో మరో కొత్త ఫోన్ తీసుకొచ్చింది. రెండు వేరియంట్లలో రెండు రంగుల్లో ఈ ఫోన్ లభ్యం కానుంది. బడ్జెట్ ధరలో ఫోన్ చూస్తున్న వారు ఈ ఫోన్ పరిశీలించొచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: షావోమి సబ్‌బ్రాండ్ పోకో (POCO) భారత మార్కెట్లో మరో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. C సిరీస్‌కు కొనసాగింపుగా సీ50 (C50) పేరిట ఓ ఎంట్రీ లెవల్ ఫోన్‌ను తీసుకొచ్చింది. రెండు వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తుంది. 2జీబీ/32జీబీ వేరియంట్ ధరను రూ.రూ.6,499గా నిర్ణయించింది. 3జీబీ/32జీబీ వేరియంట్ ధరను రూ.7,299గా పేర్కొంది. ఇక ఈ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ఆఫర్లను ఇప్పుడు చూద్దాం..
పోకో సీ50 అమ్మకాలు ఫ్లిప్‌కార్ట్‌లో జనవరి 10 నుంచి ప్రారంభం కానున్నాయి. కంట్రీ గ్రీన్, రాయల్ బ్లూ రంగుల్లో లభ్యం కానుంది. లాంచ్ డే ఆఫర్ కింద 2జీబీ వేరియంట్‌ను రూ.6,249కే విక్రయిస్తున్నారు. 3జీబీ వేరియంట్ రూ.6,999కే లభించనుంది. ఎంతకాలం ఈ ధరలు అందుబాటులో ఉంచేదీ మాత్రం కంపెనీ వెల్లడించేలేదు.
ఇక ఫీచర్ల విషయానికొస్తే... డ్యూయల్ నానో సిమ్ కలిగిన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్‌తో పనిస్తుంది. 6.52 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, 120Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో ఈ ఫోన్ వస్తోంది. మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్‌ను ఇందులో అమర్చారు. వెనుక వైపు 8 ఎంపీ కెమెరా, ముందు వైపు 5 ఎంపీ కెమెరా అందిస్తున్నారు. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. 4జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేస్తుంది. మైక్రో యూఎస్‌బీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉన్నాయి. 10W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. తక్కువ ధరలో ఫోన్ కోసం చూసేవారు ఈ ఫోన్ పరిశీలించొచ్చు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
‘వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటేయం’.. ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు తేల్చిచెప్పిన వైకాపా కార్యకర్తలు
-
Crime News
కారుపై ‘పొక్లెయిన్’ పిడుగు!.. ముగ్గురి దుర్మరణం.. ఇద్దరికి తీవ్రగాయాలు
-
Ts-top-news News
రైళ్లపై రాళ్లేస్తే అయిదేళ్ల శిక్ష.. ద.మ.రైల్వే హెచ్చరిక
-
World News
వీర్యదానంతో 550 మందికి తండ్రైన వైద్యుడు
-
Ts-top-news News
రంగంలోకి కేంద్ర నిఘా సంస్థ.. డేటా లీకేజీ వ్యవహారంలో మలుపులు
-
Ap-top-news News
పాపికొండల విహారయాత్రకు పచ్చ జెండా