CPCB: బీపీసీఎల్‌కు రూ.2 కోట్లు.. ఐఓసీకి రూ.1 కోటి ఫైన్‌

CPCB: నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లోని రిటైల్ అవుట్‌లెట్లలో ‘ఆవిరి రికవరీ సిస్టమ్స్ (VRS)’ ఇన్‌స్టాల్ చేయనందుకు తమకు సీపీసీబీ ఫైన్‌ విధించినట్లు కంపెనీలు వెల్లడించాయి.

Published : 22 Oct 2023 14:41 IST

దిల్లీ: తమ పెట్రోల్ పంపుల వద్ద కాలుష్య నియంత్రణ పరికరాలను ఏర్పాటు చేయనందుకు ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL)కు ‘కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB)’ జరిమానా విధించింది. IOCకి రూ.1 కోటి, BPCLకి రూ.2 కోట్ల జరిమానా విధించినట్లు రెండు సంస్థలు వేర్వేరు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించాయి. ‘‘నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లోని రిటైల్ అవుట్‌లెట్లలో ‘ఆవిరి రికవరీ సిస్టమ్స్ (VRS)’ ఇన్‌స్టాల్ చేయనందుకు కంపెనీ రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించాలని సీపీసీబీ నుంచి ఆదేశాలు అందాయి’’ అని IOC తెలిపింది. అయితే, సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువులోపు పెట్రోల్‌ స్టేషన్లలో వీఆర్‌ఎస్‌లను ఏర్పాటు చేయనందుకు ఈ ఫైన్‌ విధించలేదని వెల్లడించింది.

వాహనాల్లో ఇంధనం నింపేటప్పుడు పెట్రోల్ ఆవిరై వాతావరణంలోకి వెళుతుంది. ఈ ఆవిరిలో బెంజీన్, టోలీన్, క్సైలీన్‌ వంటి క్యాన్సర్ కారక పదార్థాలు ఉంటాయి. పెట్రోల్ ఆవిరి బయటకు రాకుండా ఇంధన స్టేషన్లలో VRSని అమర్చాలని 2016లో పెట్రోల్ పంపులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ‘‘సుప్రీంకోర్టు, CPCB నిర్దేశించిన సమయంలో వీఆర్‌ఎస్‌ను ఇన్‌స్టాల్ చేయనందుకు CPCBకి రూ.2 కోట్లు పరిహారం చెల్లించాలని పర్యావరణ (రక్షణ) చట్టం, 1986లోని సెక్షన్ 5 కింద నోటీసు అందుకున్నట్లు BPCL ఒక ప్రత్యేక ఫైలింగ్‌లో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని