PSU banks profit: ప్రభుత్వరంగ బ్యాంకుల లాభాల్లో 65% వృద్ధి

PSU banks profit jumps 65 pc: ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది తొలి మూడు త్రైమాసికాల్లో వరుసగా లాభంలో 9 శాతం, 50 శాతం, 65 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

Published : 12 Feb 2023 12:37 IST

దిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభాలు (PSU banks profit) డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో 65 శాతం పెరిగి రూ.29,175 కోట్లకు చేరాయి. లాభాల్లో వృద్ధిపరంగా బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (BoM) మంచి పనితీరు కనబర్చింది. ఈ బ్యాంకు లాభం 139 శాతం పెరిగి రూ.775 కోట్లకు చేరింది.

బీఓఎం తర్వాత యూకో బ్యాంక్‌ లాభం 110 శాతం వృద్ధితో రూ.653 కోట్లకు చేరింది. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ బ్యాంక్‌ లాభాల్లో సైతం 100 శాతానికి పైగా వృద్ధి నమోదుకావడం విశేషం. ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న యూనియన్‌ బ్యాంక్‌ లాభం 107 శాతం పెరిగి రూ.2,245 కోట్లకు చేరింది. ఇండియన్‌ బ్యాంక్‌ లాభం 102 శాతం వృద్ధితో రూ.1,936 కోట్లకు పెరిగింది.

మొత్తం 12 ప్రభుత్వరంగ బ్యాంకులు (PSU banks) కలిపి రూ.29,175 కోట్ల లాభాన్ని నమోదు చేశాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభం రూ.17,729 కోట్లుగా ఉంది. 65 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల వ్యవధిలో పీఎస్‌బీల లాభాలు (PSU banks profit) రూ.48,893 కోట్ల నుంచి 43 శాతం పెరిగి రూ.70,166 కోట్లకు చేరాయి. తొలి త్రైమాసికంలో రూ.15,306 కోట్లు, రెండో త్రైమాసికంలో రూ.25,685 కోట్లు, మూడో దాంట్లో రూ.29,175 కోట్ల లాభాల్ని గడించడం విశేషం. వరుసగా 9 శాతం, 50 శాతం, 65 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

స్థూల, నికర నిరర్థక ఆస్తుల (NPAs) పరంగా చూస్తే బీఓఎం, ఎస్‌బీఐ (SBI) అతితక్కువ ఎన్‌పీఏల (NPAs) ను కలిగి ఉన్నాయి. ఈ రెండు బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు వరుసగా 2.94 శాతం, 3.14 శాతంగా ఉన్నాయి. నికర ఎన్‌పీఏలు 0.47 శాతం, 0.77 శాతంగా నమోదయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని