Rakesh Jhunjhunwalas: రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా 4 బిలియన్‌ డాలర్ల స్టాక్స్‌పై మదుపర్ల దృష్టి

స్టాక్‌ మార్కెట్‌ బిగ్‌బుల్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా కన్నుమూయడంతో.. ఇప్పుడు ఆయన పోర్టుఫోలియో నిర్వహణ ఎలా ఉంటుందనే అంశంపై మదుపర్లు ఆసక్తిగా ఉన్నారు.  ఆయనకు వివిధ కంపెనీల్లో

Updated : 21 Nov 2022 16:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: స్టాక్‌ మార్కెట్‌ బిగ్‌బుల్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా కన్నుమూయడంతో.. ఇప్పుడు ఆయన పోర్టుఫోలియో నిర్వహణ ఎలా ఉంటుందనే అంశంపై మదుపర్లు ఆసక్తిగా ఉన్నారు.  ఆయనకు వివిధ కంపెనీల్లో బిలియన్‌ డాలర్ల విలువైన స్టాక్స్‌ ఉన్నాయి. సాధారణంగా భారతీయ మార్కెట్లలో మదుపు చేసే రిటైల్‌ ఇన్వెస్టర్లు రాకేశ్‌ పెట్టుబడులను జాగ్రత్తగా గమనిస్తారు. కొన్ని సందర్భాల్లో అనుసరిస్తారు కూడా. మార్కెట్‌ను అత్యధికంగా ప్రభావితం చేసే వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఈ నేపథ్యంలో ఆయన చాలా వ్యాపారాలు, స్టార్టప్‌ల్లో కూడా డబ్బును మదుపు చేశారు.  

రాకేశ్‌ అత్యధికంగా పెట్టుబడి పెట్టిన స్టాక్స్‌లో నగల వ్యాపార దిగ్గజం టైటాన్‌ కో ఒకటి. రాకేశ్‌, ఆయన సతీమణి రేఖ ఈ స్టాక్‌పై భారీగా ఆదాయం గడించారు. రాకేశ్‌ పెట్టుబడుల్లో మూడోవంతు ఈ స్టాక్‌ ఉందని బ్లూమ్‌బెర్గ్‌ డేటా చెబుతోంది. దీంతోపాటు స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌, మెట్రో బ్రాండ్‌ లిమిటెడ్‌, టాటా మోటార్స్‌, ఆప్టెక్‌, నజరా టెక్నాలజీస్‌ వంటి 47 కంపెనీల్లో  వాటాలు ఉన్నాయి. బ్లూమ్‌బెర్గ్‌ లెక్కల ప్రకారం ఈ వాటాల మొత్తం విలువ సుమారు 4 బిలియన్‌ డాలర్ల (రూ.31 వేల కోట్లు) వరకు ఉంటుంది.

* టైటాన్‌ - 1.4 బిలియన్‌ డాలర్లు

* స్టార్‌ హెల్త్‌- 884 మిలియన్‌ డాలర్లు

* మెట్రో బ్రాండ్స్‌ - 281 మిలియన్‌ డాలర్లు

* టాటా మోటార్స్‌ (షేర్లు, డీవీఆర్‌లు) - 262 మిలియన్‌ డాలర్లు

* క్రిసిల్‌ - 164 మిలియన్‌ డాలర్లు

* ఫొర్టిస్‌ హెల్త్‌కేర్‌ - 113 మిలియన్‌ డాలర్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని