Stock market: ఫ్లాట్‌గా దేశీయ మార్కెట్‌ సూచీలు

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ 20 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 1 పాయింట్‌ నష్టంతో ముగిశాయి.

Published : 05 Apr 2024 16:17 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ఆర్‌బీఐ వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించడంతో సూచీలపై పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే, భవిష్యత్‌లో వడ్డీ రేట్ల కోత ఎప్పుడు ఉంటుందనే దానిపై స్పష్టమైన సంకేతాలు లేకపోవడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం వంటివి మదుపరులపై ప్రభావం చూపాయి. దీంతో సూచీలు స్తబ్దుగా ముగిశాయి.

సెన్సెక్స్‌ ఉదయం 74,287.02 వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైన కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. రోజంతా లాభ, నష్టాల మధ్య కదలాడింది. 73,946 - 74,361 మధ్య చలించిన సూచీ.. చివరికి 20.59 పాయింట్ల వద్ద 74,248.22 ముగిసింది. నిఫ్టీ సైతం 0.95 పాయింట్ల నష్టంతో 22,513.70 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.30గా ఉంది. సెన్సెక్స్‌లో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐటీసీ, ఎస్‌బీఐ షేర్లు ప్రధానంగా లాభపడగా.. అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎల్‌అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, మారుతీ సుజుకీ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్‌ రకం బ్యారెల్‌ 90.98 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ఔన్సు 2314 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు