Maruti Suzuki: చిన్న కార్లు మళ్లీ వస్తాయ్‌.. మారుతీ ఛైర్మన్‌ ఆర్‌సీ భార్గవ ఆసక్తికర కామెంట్స్‌

Maruti Suzuki: రాబోయే రెండేళ్లలో చిన్న కార్ల విక్రయాలు తిరిగి పుంజుకుంటాయని మారుతీ ఛైర్మన్‌ ఆర్‌సీ భార్గవ అన్నారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిన్న కార్ల మార్కెట్‌, విద్యుత్‌ వాహనాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published : 04 Apr 2024 21:12 IST

Maruti Suzuki | ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయంగా కార్ల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా స్పోర్ట్స్‌ వినియోగ వాహనాల (SUV)కు మంచి డిమాండ్‌ నెలకొంది. వీటి విక్రయాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఆ సమయంలో చిన్న కార్ల అమ్మకాలు తగ్గుముఖం పడుతున్నాయి. భవిష్యత్తులో వీటికి డిమాండ్‌ మరింత తగ్గనుందన్న వార్తల నేపథ్యంలో మారుతీ (Maruti Suzuki) ఛైర్మన్‌ ఆర్‌సీ భార్గవ (rc bhargava) ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

ఎంట్రీలెవల్ కస్టమర్ల ఆదాయం పెరగడం, స్కూటర్‌, మోటార్‌ సైకిల్‌ని వినియోగించేవారు ఇతర వాహనాలకు అప్‌గ్రేడ్‌ కావాలని చూస్తుండటం వంటి కారణాలతో చిన్న కార్ల అమ్మకాలు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటాయని ఆర్‌సీ భార్గవ అన్నారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారత్‌లో తగ్గుముఖం పట్టిన చిన్నకార్ల పరిశ్రమ రెండేళ్లలో తిరిగి పుంజుకుంటుందన్నారు. ద్విచక్ర వాహనాల నుంచి కార్లకు మారాలనుకునేవారు.. నేరుగా ఎస్‌వీయూవీలను కొనుగోలు చేయరని అభిప్రాయపడ్డారు. ఎలక్ట్రిక్‌ వాహనాల గురించి కూడా భార్గవ మాట్లాడారు. బొగ్గు నుంచి ఉత్పత్తి చేస్తే వచ్చే విద్యుత్‌ని ఉపయోగించి వాహనాలను ఛార్జ్‌ చేస్తే కర్భన ఉద్గారాలు తగ్గించడంలో సాయపడదన్నారు. కాలుష్యం తగ్గాలంటే బయో ఫ్యూయల్, ఇథనాల్, సీఎన్‌జీ వంటి వాటిని వినియోగించాలన్నారు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రుణాలు 1.6 శాతం వృద్ధి

నిర్వహణ వ్యయాలు, ఇన్సూరెన్స్‌ ఛార్జీలు, రోడ్డు పన్నులు, కర్భన ఉద్గార నిబంధనల్లో వచ్చిన మార్పుల కారణంగా చిన్న కార్లు, ద్విచక్ర వాహనాల ధరలు పెరిగాయి. వీటి ధరలు పెరగడం డిమాండ్‌పై ప్రభావం చూపింది. గత ఆర్థిక సంవత్సరంలో చిన్న కార్ల విక్రయాలు 12 శాతం తగ్గాయి. దీంతో హోండా, నిస్సాన్‌, వోక్స్‌వ్యాగన్‌ లాంటి సంస్థలు చిన్న కార్ల మార్కెట్‌ నుంచి తమ వాటాను క్రమంగా తగ్గించుకున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా రికార్డ్‌ స్థాయిలో కార్ల అమ్మకాలు జరిగాయి. వాటిలో ఎస్‌యూవీల వాటా పెరగ్గా.. చిన్న కార్ల వాటా తగ్గింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని