Tesla: రెండు లక్షల టెస్లా కార్ల రీకాల్‌.. కారణం ఇదే..

Tesla: విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా పెద్ద ఎత్తున కార్లను రీకాల్‌ చేసింది. సాంకేతిక లోపం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. 

Updated : 26 Jan 2024 23:34 IST

Tesla | ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాకు చెందిన ప్రముఖ విద్యుత్తు కార్ల (EV) తయారీ సంస్థ టెస్లా (Tesla).. పెద్ద ఎత్తున వాటిని రీకాల్‌ చేసింది. బ్యాకప్‌ కెమెరాలో తలెత్తిన లోపాల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికాలో విక్రయించిన దాదాపు 2లక్షల టెస్లా కార్లను రీకాల్‌ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. 

2023లో తీసుకొచ్చిన వై (Y), ఎస్‌(S), ఎక్స్‌(X) మోడళ్లలో సాఫ్ట్‌వేర్‌లో సమస్యను గుర్తించినట్లు టెస్లా తెలిపింది. కారు రివర్స్‌లో ఉన్నప్పుడు బ్యాకప్‌ కెమెరా పనిచేయకపోవడం వంటి సమస్యలు తలెత్తినట్లు గుర్తించారు. ఈ తరహా లోపం కారణంగా ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. ఇప్పటివరకు ఈ సమస్యతో ప్రమాదాలు జరిగినట్లు తమ దృష్టికి రాలేదని పేర్కొంది. ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో ఈ సాంకేతిక సమస్య పరిష్కరించవచ్చని వెల్లడించింది. అమెరికా నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌కు అందించిన నివేదికలో ఈ విషయాలను తెలిపింది. త్వరలో ఆయా వాహన యజమానులకు వ్యక్తిగతంగా సమాచారం అందిస్తామని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు