Electric motorcycle: 307km రేంజ్‌తో ఎలక్ట్రిక్‌ బైక్‌.. ధర కొంచెం ఎక్కువే!

బెంగళూరుకు చెందిన స్టార్టప్‌ కంపెనీ అల్ట్రావైలెట్‌ F77 పేరిట ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌ను లాంచ్‌ చేసింది. స్టాండర్డ్‌, రెకాన్‌ వేరియంట్లలో ఈ బైక్‌ను తీసుకొచ్చింది.

Updated : 24 Nov 2022 19:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బెంగళూరుకు చెందిన స్టార్టప్‌ కంపెనీ అల్ట్రావైలెట్‌ F77 పేరిట ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌ను లాంచ్‌ చేసింది. స్టాండర్డ్‌, రెకాన్‌ వేరియంట్లలో ఈ బైక్‌ను తీసుకొచ్చింది. దీంతో పాటు లిమిటెడ్‌ ఎడిషన్‌ పేరిట మరో వేరియంట్‌నూ ఆవిష్కరించింది. బేస్‌ మోడల్‌ ధరను రూ.3.8 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌)గా నిర్ణయించగా.. రెకాన్‌ వేరియంట్‌ ధరను రూ.4.5 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. లిమిటెడ్‌ ఎడిషన్‌ బైక్‌ ధరను రూ.5.5 లక్షలుగా పేర్కొంది.

F77 స్టాండర్డ్‌ వెర్షన్‌ రేంజ్‌ 206 కిలోమీటర్లుగా కంపెనీ పేర్కొనగా.. F77 రెకాన్‌ 307 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది. బ్యాటరీపై 8 ఏళ్ల వారెంటీ ఇస్తోంది. F77 స్టాండర్డ్‌ వెర్షన్‌ 27kW పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది గరిష్ఠంగా 140 కిలోమీటర్లు వేగం వెళ్తుందని కంపెనీ పేర్కొంది. రెకాన్‌ వెర్షన్‌ 29kW పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది. గరిష్ఠంగా 147 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది. వీటితో పాటు లిమిటెడ్‌ ఎడిషన్‌లో భాగంగా కేవలం 77 వాహనాలను మాత్రమే తీసుకురానున్నారు. ఈ బైక్‌ గరిష్ఠంగా 152 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. మూడు బైకుల్లోనూ గ్లైడ్‌, కంబాట్‌, బాలిస్టిక్‌ రైడ్‌ మోడ్స్‌ ఉన్నాయి. 

ఇతర స్పెసిఫికేషన్లు చూస్తే ఎల్‌ఈడీల లైట్లు, టీఎఫ్‌టీ డిస్‌ప్లే, కనెక్టివిటీ ఫీచర్లు, ముందూ వెనుక డిస్క్‌ బ్రేకులు, అల్లాయ వీల్స్‌ వంటివి ఉన్నాయి. డ్యూయల్‌ ఛానెల్‌ ఏబీఎస్‌ అందిస్తున్నారు. రూ.10వేల టోకెన్‌ అమౌంట్‌తో అక్టోబర్‌ 23 నుంచే బుకింగ్‌లు ప్రారంభమయ్యాయని కంపెనీ తెలిపింది. వచ్చే ఏడాది జనవరిలో బెంగళూరులో తర్వాత దిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్‌ వంటి ఇతర నగరాల్లో ఈ బైక్‌ను డెలివరీ చేయనున్నామని కంపెనీ పేర్కొంది. అల్ట్రావైలెట్‌ కంపెనీలో TVS పెట్టుబడులు ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని