Budget 2023: ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి..? ఏవి పెరుగుతాయి..?
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) బడ్జెట్ 2023 (Budget 2023)ను ప్రవేశపెట్టారు. దీంతో పలు వస్తువుల ధరలు పెరగనుండగా.. మరికొన్ని తగ్గనున్నాయి.
దిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు పూర్తిస్థాయి బడ్జెట్ (Budget 2023)ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వం కొన్నింటిపై దిగుమతి సుంకాల రాయితీ కల్పించగా, మరికొన్నింటిపై పన్ను భారం వేయడంతో కీలక వస్తువుల ధరల్లో మార్పులు రానున్నాయి. బడ్జెట్-2023 ప్రకారం.. ఏయే వస్తువుల ధరలు తగ్గుతాయి..? వేటిపై భారం పడనుందనే విషయాన్ని ఓసారి పరిశీలిస్తే..
* కెమెరా లెన్సులపై కస్టమ్స్ సుంకంపై ఏడాది పాటు మినహాయింపు
* టీవీ పార్టులపై ప్రస్తుతం ఉన్న 5శాతం కస్టమ్స్ సుంకాన్ని 2.5శాతానికి తగ్గించారు. దీంతో వీటి ధరలు తగ్గే అవకాశం
* వెండిపై దిగుమతి సుంకాన్ని పెంచడంతో వీటి ధర పెరిగే అవకాశం
* లిథియం అయాన్ బ్యాటరీలకు అవసరమైన సామగ్రిపైనా కస్టమ్స్ సుంకాన్ని మినహాయించారు
* రొయ్యల ఆహార ఉత్పత్తుల దిగుమతిపైనా కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు. దీంతో దేశీయంగా తయారు చేసే వాటి ధరలు తగ్గుతాయి
ధరలు తగ్గేవి
* మొబైల్, ల్యాప్‌టాప్, డీఎస్‌ఎల్‌ఆర్‌ల కెమెరా లెన్సులు
* టీవీ ప్యానెల్ పార్టులు
* లిథియం అయాన్ బ్యాటరీలు
* ఎలక్ట్రిక్ వాహనాలు
* దేశీయంగా ఉత్పత్తి చేసే రొయ్యల ఆహారం
* డైమండ్‌ల తయారీ వస్తువులు
పెరిగేవి
* బంగారం, ప్లాటినంతో తయారు చేసే వస్తువులు
* వెండి ఉత్పత్తులు
* సిగరెట్లు, టైర్లు
* దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్ చిమ్నీలు
* రాగి తుక్కు
* రబ్బర్
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Supreme Court: లోక్సభ సభ్యత్వ అనర్హత.. ఫైజల్ అహ్మద్ పిటిషన్పై విచారణ నేడు
-
Crime News
Cyber Crime : ఇంట్లో కూర్చోబెట్టే కాజేత
-
World News
Saudi Arabia: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది హజ్ యాత్రికుల మృతి
-
Politics News
Vangalapudi Anitha: 40 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు: అనిత
-
Politics News
Raghurama: నాడు తెదేపాలో లక్ష్మీపార్వతిలాగా నేడు వైకాపాలో సజ్జల వ్యవహరిస్తున్నారు
-
World News
వయసు 14.. బూట్ల సైజు 23!.. అసాధారణ రీతిలో పెరుగుతున్న పాదాలు