Vivo: వివో నుంచి రెండు ప్రీమియం ఫోన్స్‌.. ధర రూ.60వేల పైనే..!

Vivo Smartphones: చైనా మొబైల్‌ తయారీ కంపెనీ వివో ఎక్స్‌ 100, ఎక్స్‌100 ప్రో పేరుతో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.

Published : 04 Jan 2024 17:06 IST

Vivo Smartphones | ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా మొబైల్‌ తయారీ కంపెనీ వివో (Vivo) రెండు కొత్త ఫోన్లను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. వివో ఎక్స్‌100 (Vivo X100), వివో ఎక్స్‌100 ప్రో (Vivo X100 Pro) పేరుతో స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది. వీటి ప్రీ బుకింగ్‌లు మొదలయ్యాయని కంపెనీ పేర్కొంది. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డుల ద్వారా ప్రీ బుకింగ్ చేసుకుంటే 10 శాతం క్యాష్‌బ్యాక్‌, రూ.8వేలు అప్‌గ్రేడ్‌ బోనస్‌ పొందొచ్చని కంపెనీ తెలిపింది. జవనరి 11 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయని పేర్కొంది. వివో ఇండియా వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు అన్ని రిటైల్‌ దుకాణాల ద్వారా కొనుగోలు చేయొచ్చని కంపెనీ వెల్లడించింది.

వివో ఎక్స్‌100 ప్రో (Vivo X100 Pro)

వివో విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల అమోలెడ్‌ 8టీ ఎల్‌టీపీఓ కర్వ్‌డ్‌ డిస్‌ప్లేతో వస్తోంది. 120Hz స్క్రీన్‌ రిఫ్రెష్‌ రేటు, 3000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్‌ 14తో వస్తోంది. 5,400mAh బ్యాటరీ, 100W ఫాస్ట్‌ ఛార్జింగ్ సదుపాయం ఉంది. ట్రిపుల్‌ కెమెరాతో ఈ ఫోన్‌ వస్తోంది. 50 ఎంపీ సోనీ IMX989 OIS కెమెరా, 50ఎంపీ అల్ట్రా వైడ్‌ కెమెరా, 50 ఎంపీ Zeiss APO సూపర్‌ టెలిఫొటో లెన్స్‌ ఇచ్చారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32 ఎంపీ కెమెరా ఉంది. 16జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ.89,999గా కంపెనీ నిర్ణయించింది. బ్లాక్‌ రంగులో లభించే ఈ ఫోన్‌.. వైఫై 7, బ్లూటూత్‌ 5.4, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్‌, ఓటీజీ, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌తో వస్తోంది. దుమ్ము, నీరు చేరకుండా IP68 రేటింగ్‌ కలిగి ఉందని వివో తెలిపింది.

వివో ఎక్స్‌100 (Vivo X100)

వివో ఎక్స్‌100 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్‌, డిస్‌ప్లే తరహా ఫీచర్లే వివో ఎక్స్‌100లో ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఇందులో 50 ఎంపీ సోనీ IMX920 వీసీఎస్‌ బయోనిక్‌ కెమెరా, 50ఎంపీ అల్ట్రా వైడ్‌ కెమెరా, 64 ఎంపీ Zeiss సూపర్‌ టెలిఫొటో కెమెరా అమర్చారు. సెల్ఫీ కోసం ముందు భాగంలో 32 ఎంపీ కెమెరా ఇచ్చారు. 5,000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్‌ ఛార్జింగ్ సదుపాయం ఉంది. అయితే ఈ ఫోన్‌ రెండు వేరియంట్లలో రానుంది. 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.63,999, 16జీబీ+512జీబీ వేరియంట్‌ ధర రూ.69,999గా కంపెనీ నిర్ణయించింది. బ్లాక్‌, బ్లూ రంగుల్లో లభిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని