Zomato: ఏఐ చాట్‌ బాట్‌ను ప్రారంభించిన జొమాటో.. వారికి మాత్రమే అందుబాటులో..!

Zomato: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటో AI చాట్‌బాట్‌ను సేవల్ని ప్రారంభించినట్లు తెలిపింది. ఫుడ్‌ ఆర్డర్‌ చేసే సమయంలో ఈ వ్యక్తిగత చాట్‌ బాట్‌ కస్టమర్లకు సహాయపడుతుందని కంపెనీ పేర్కొంది.

Published : 02 Sep 2023 01:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దాదాపు అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) హవా కొనసాగుతోంది. ఫుడ్‌ డెలివరీ విభాగంలోనూ తన సేవల్ని అందిస్తోంది. ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) సైతం ఈ సేవల్ని ప్రారంభించినట్టు ప్రకటించింది. ఆహార పదార్థాలను ఎంచుకోవడంలో తమ కస్టమర్లకు సహాయ పడేందుకు ఈ వ్యక్తిగత చాట్‌బాట్‌ తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది.

ఆగస్టు జీఎస్టీ వసూళ్లలో 11 శాతం వృద్ధి

జొమాటోలో ఏదైనా ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టాలనుకున్నప్పుడు ఏ ఆహారాన్ని ఎంచుకోవాలో తెలియని సమయంలో ఇది సహాయపడుతుంది. ఉదాహరణకు.. నాకు ప్రొటీన్‌ ఫుడ్‌ తినాలని ఉంది.. ఏ ఆహారమైతే మంచిది? ఇప్పుడు ఎక్కువగా ఫుడ్‌ క్రేవింగ్స్‌ ఉన్నాయి.. ఏ ఫుడ్‌ ఆర్డర్‌ చేయాలి? డైట్‌లో ఉన్నప్పుడు ఏ ఆహార పదార్థం తినాలి? ఇలాంటి ప్రశ్నలకు ఈ AI వ్యక్తిగత చాట్‌బాట్‌ సహాయ పడుతుంది. అంతేకాకుండా,  కస్టమర్లకు నచ్చిన వంటకాలను అందించే రెస్టారెంట్‌ జాబితాలను కూడా అదే చూపుతుంది. జొమాటో లేటెస్ట్‌ అప్‌డేట్‌తో ఏఐ చాట్‌బాట్‌ పొందవచ్చని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ జొమాటో గోల్డ్‌ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నట్టు సంస్థ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని