logo

మహారాష్ట్ర రైతులు మనవైపు!

ఖరీఫ్‌ సమీపిస్తుండటంతో విత్తనాల దుకాణాల వద్ద సందడి నెలకొంది. పత్తి విత్తనాల కోసం మన రైతులే కాదు, సరిహద్దున ఉన్న మహారాష్ట్ర రైతులు ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి తరలివస్తున్నారు.

Published : 02 Jun 2023 04:05 IST

విత్తనాల కోసం ఆదిలాబాద్‌కు బారులు

దుకాణం వద్ద మహారాష్ట్ర రైతులు

 ఈనాడు, ఆదిలాబాద్‌: ఖరీఫ్‌ సమీపిస్తుండటంతో విత్తనాల దుకాణాల వద్ద సందడి నెలకొంది. పత్తి విత్తనాల కోసం మన రైతులే కాదు, సరిహద్దున ఉన్న మహారాష్ట్ర రైతులు ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి తరలివస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో పండించే పత్తికి ఆసియా ఖండంలో మంచి పేరు  ఉండటంతో ఇక్కడ సాగుచేసే విత్తనాలకు భారీ డిమాండ్‌ ఉంది. ఈ ప్రాంతం నుంచి తీసుకెళ్లే విత్తనాలు సాగు చేస్తే పంట బాగా పండుతుందనే నమ్మకంతో.. పత్తి విత్తనాల కోసం మహారాష్ట్రలోని దాదాపు అయిదు జిల్లాల రైతులు తెలంగాణ బాట పట్టారు. అక్కడ ఎక్కువగా నకిలీ విత్తనాలు అంటగడుతున్నారని రైళ్లు, ద్విచక్ర వాహనాల ద్వారా వేలాది మంది రైతులు ఆదిలాబాద్‌ చేరుకొని పత్తి విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. దుకాణాల్లో రద్దీ నెలకొంది.

కొనుగోలు చేసిన పత్తి విత్తనాలతో మహారాష్ట్ర వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌లో వేచి ఉన్న అన్నదాతలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని