logo

రాక్షస పాలనకు యువగళంతో చరమగీతం

రాష్ట్రంలో రాక్షస పాలనకు యువగళం పాదయాత్రతో చరమగీతం పాడాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం విజయవంతం కావాలని కోరుతూ తెదేపా బీసీ సెల్‌ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి దుర్గగుడి వరకు నాయకులు బుధవారం ర్యాలీ చేశారు.

Updated : 26 Jan 2023 05:01 IST

విద్యాధరపురం, న్యూస్‌టుడే : రాష్ట్రంలో రాక్షస పాలనకు యువగళం పాదయాత్రతో చరమగీతం పాడాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం విజయవంతం కావాలని కోరుతూ తెదేపా బీసీ సెల్‌ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి దుర్గగుడి వరకు నాయకులు బుధవారం ర్యాలీ చేశారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగన్మాత దుర్గమ్మకు శాస్త్రోక్తంగా సారె సమర్పించారు. టోల్‌గేటు వద్ద కామధేను అమ్మవారికి నాయకులు పూజలు చేయించి కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బీసీ ద్రోహి అన్నారు. బీసీ సబ్‌ ప్లాన్‌ నిధులు రూ.35వేల కోట్లు దారి మళ్లించారని ఆరోపించారు. మాజీ మంత్రి దేవినే ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ యువతకు భరోసా కల్పించేందుకే నారా లోకేశ్‌ రాష్ట్రంలో 4 వేల కిలోమీటర్ల  మేర పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారన్నారు. తెదేపా నాయకులు కొనకళ్ల నారాయణ, బచ్చుల అర్జనుడు, గరుమూర్తి, రావి వెంకటేశ్వరరావు, బోడే ప్రసాద్‌, కాగిత కృష్ణ, ఎర్రుబోతు రమణారావు, చెన్నుపాటి ఉషారాణి, బంకా నాగమణి, షేక్‌ ఆషా పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని