logo

ఆకట్టుకున్న శునకాల ప్రదర్శన

కానూరు షామ్‌రాక్‌ ఇంటర్నేషనల్‌ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన విజయవాడ డాగ్‌ షో విశేషంగా ఆకట్టుకుంది.

Updated : 06 Feb 2023 05:52 IST

కానూరు షామ్‌రాక్‌ ఇంటర్నేషనల్‌ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన విజయవాడ డాగ్‌ షో విశేషంగా ఆకట్టుకుంది. నగర పరిసర ప్రాంతాలకు చెందిన మేలుజాతి, పెంపుడు శునకాలతో యజమానులు ఉత్సాహంగా హాజరయ్యారు. డాబర్‌మెన్‌, పామరేరియన్‌, లాబ్రేడార్‌లతో పాటు దేశ విదేశాలకు చెందిన అనేక జాతుల శునకాలు ఈ ప్రదర్శనలో ఆకట్టుకున్నాయి. ఔరంగాబాద్‌కు చెందిన ముకుంద్‌ జోషి న్యాయనిర్ణేతగా వ్యవహరించి ఆకర్షణీయంగా నిలిచిన శునకాలను విజేతలుగా ఎంపిక చేసి వాటి యజమానులకు బహుమతులు అందజేశారు.

డాగ్‌షోకు వచ్చిన యువతులు

పోటీలో విజేతకు బహుమానం

న్యూస్‌టుడే, పెనమలూరు, కానూరు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు