logo

జొన్న రైతుకు ఎంత కష్టం!

జొన్న రైతుల ఆశలు అడియాసలవుతున్నాయి. ప్రస్తుతం పంట పొట్ట దశకు చేరుకుంది. మరి కొద్ది రోజుల్లో పంట చేతికి రానుంది.

Published : 27 Mar 2023 05:06 IST

పొట్ట దశకు చేరిన పంట

జొన్న రైతుల ఆశలు అడియాసలవుతున్నాయి. ప్రస్తుతం పంట పొట్ట దశకు చేరుకుంది. మరి కొద్ది రోజుల్లో పంట చేతికి రానుంది. రెండేళ్ల కిందట జొన్నలు క్వింటా ధర రూ.2200 ఉండగా గతేడాది రూ.1700 లకు వ్యాపారులు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆ ధర కూడా దక్కేలా లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గన్నవరం మండలంలోని సావరగూడెం, పురుషోత్తపట్నం, ముస్తాబాద, సూరంపల్లి గ్రామాల్లో సుమారు 350 ఎకరాల్లో దాళ్వాగా జొన్న పంటను సాగు చేశారు. దాళ్వాలకు ఆయా గ్రామ చెరువుల నుంచి నీటిని పంటలకు అందించేందుకు మోటార్లు ఉపయోగిస్తుంటారు. మోటార్లకు అయ్యే ఖర్చుతో పాటు విత్తనం విత్తే దశ నుంచి పంట చేతికొచ్చే వరకు పెట్టుబడి ఎకరాకు రూ.20వేల నుంచి రూ.25వేల వరకు అవుతోందని రైతులు చెబుతున్నారు. పెట్టుబడే భారంగా మారిందనుకుంటే చెరువుల నుంచి నీటి తడులకు అదనపు ఖర్చవుతుందని కర్షకులు వాపోతున్నారు. దీంతో జొన్న పంటను సాగు చేస్తే అప్పులపాలవుతున్నామంటూ ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి మార్కెట్‌ యార్డుల ద్వారా జొన్నలను క్వింటా ధర రూ.2500 చొప్పున కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని