logo

TS News: ‘టీకా తీసుకోకపోతే రేషన్‌ బియ్యం, పింఛన్లు నిలిపివేస్తాం’

రెండు విడతల్లో కరోనా టీకా తీసుకోని వారికి పింఛన్లు, రేషన్‌ బియ్యం నిలిపివేస్తామని మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ పురపాలిక మెప్మా సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఆదివారం ఇంటింటికీ తిరుగుతూ హెచ్చరికలు చేశారు. బ్యాంకుల నుంచి

Updated : 13 Dec 2021 09:59 IST

ఓ ఇంటికి స్టిక్కర్‌ అంటిస్తున్న మెప్మా సిబ్బంది

నర్సాపూర్‌, న్యూస్‌టుడే: రెండు విడతల్లో కరోనా టీకా తీసుకోని వారికి పింఛన్లు, రేషన్‌ బియ్యం నిలిపివేస్తామని మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ పురపాలిక మెప్మా సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఆదివారం ఇంటింటికీ తిరుగుతూ హెచ్చరికలు చేశారు. బ్యాంకుల నుంచి రుణాలు కూడా రావని అన్నారు. టీకా విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదని సూచించారు. భయం వీడాలని, ఇప్పటికే దేశంలో కోట్లాది మంది టీకా వేసుకున్నారన్నారు. రెండు టీకాలు తప్పక తీసుకోవాలన్నారు. ఇంటింటి సర్వేలో భాగంగా టీకాలు తీసుకున్న వారి ఇళ్లకు కరపత్రాల స్టిక్కర్లు అంటించారు. ఈ సందర్భంగా ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్‌ మధు, పారిశుధ్య పర్యవేక్షకుడు మురళీ మాట్లాడుతూ.. అర్హులందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలనే ఉద్దేశంతోనే అలా చెబుతున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు