logo

మూడు కూడళ్లపై రయ్యిమని సాగేలా

గచ్చిబౌలి, కొండాపూర్‌ ప్రాంతాల మధ్య సాఫీ ప్రయాణానికి మార్గం సుగమమైంది. బొటానికల్‌గార్డెన్‌ కూడలి, కొత్తగూడ కూడలి, కొండాపూర్‌ కూడలి మీదుగా రాకపోకలు సులభతరం కానున్నాయి.

Published : 24 Nov 2022 01:51 IST

వచ్చే నెలలో గచ్చిబౌలి-కొండాపూర్‌ పైవంతెన ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: గచ్చిబౌలి, కొండాపూర్‌ ప్రాంతాల మధ్య సాఫీ ప్రయాణానికి మార్గం సుగమమైంది. బొటానికల్‌గార్డెన్‌ కూడలి, కొత్తగూడ కూడలి, కొండాపూర్‌ కూడలి మీదుగా రాకపోకలు సులభతరం కానున్నాయి. ఆయా కూడళ్లపై నిర్మించిన పైవంతెన డిసెంబరు నెలాఖరులో అందుబాటులోకి రాబోతుంది. పనులు 95 శాతం పూర్తయ్యాయి. గచ్చిబౌలి-హఫీజ్‌పేట్‌ మధ్య తిరిగే వాహనాలకు ఈ నిర్మాణం చాలా ఉపయోగపడుతుంది. అలాగే.. మజీద్‌బండ మార్గం నుంచి కొండాపూర్‌ వెళ్లే వాహనాలు ఈ పైవంతెనపైకి ఎక్కొచ్చు. బొటానికల్‌గార్డెన్‌ రోడ్డు వైపు నుంచి నిర్మించిన ర్యాంపు అందుకు ఉపయోగపడుతుంది. గచ్చిబౌలి, మజీద్‌బండ మార్గాల నుంచి పైవంతెన ఎక్కిన వాహనాలు గూగుల్‌ రోడ్డును చేరేందుకు కొత్తగూడ కూడలిలో డౌన్‌ ర్యాంపు కూడా ఉంటుంది. కొండాపూర్‌ ఆర్‌టీఏ కార్యాలయం నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లాల్సిన వాహనాల కోసం కొత్తగూడ కూడలిలో ప్రత్యేకంగా అర కిలోమీటరు పొడవున అండర్‌పాస్‌ నిర్మించిన విషయం తెలిసిందే. మొత్తంగా పైవంతెన, అండర్‌పాస్‌ అందుబాటులోకి వస్తే కొత్తగూడ కూడలిలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ అవసరం లేకుండా వాహనాలు సాఫీగా సాగిపోవచ్చు. కొత్తగూడ కూడలిలో నిర్మించిన అండర్‌పాస్‌ సైతం ప్రారంభోత్సవానికి రంగులద్దుకుంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని