logo

త్వరలోనే క్రీడా పాలసీ: శ్రీనివాస్‌గౌడ్‌

నిత్యం పని ఒత్తిడిలో ఉండే ఉద్యోగులకు మానసికోల్లాసం కోసం క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని రాష్ట్ర మంత్రి డా.వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

Published : 06 Dec 2022 02:19 IST

శాంతి కపోతాలను ఎగురవేసిన మంత్రులు మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌గౌడ్‌, నేతలు

నారాయణగూడ, న్యూస్‌టుడే: నిత్యం పని ఒత్తిడిలో ఉండే ఉద్యోగులకు మానసికోల్లాసం కోసం క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని రాష్ట్ర మంత్రి డా.వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. సోమవారం ఎల్బీ స్టేడియంలో టీఎన్జీవోస్‌ హైదరాబాద్‌ జిల్లా సంఘం అధ్యక్షుడు ముజీబ్‌ ఆధ్వర్యంలో 8వ క్రీడోత్సవం ప్రారంభమైంది. జాతీయ జెండాను ఆవిష్కరించి, శాంతి కపోతాలను ఎగురవేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. త్వరలోనే క్రీడా పాలసీ రానుందన్నారు. క్రీడాకారులకు రిజర్వేషన్ల అంశం కూడా ఆలోచనలో ఉందన్నారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి ముహమ్మద్‌ మహమూద్‌ అలీ మాట్లాడుతూ..కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రమంతా సుభిక్షంగా ఉందన్నారు. టీఎన్జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రవీందర్‌, అసోసియేట్‌ అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్‌, టీజీవో కార్యదర్శి సుజాత, టీఎన్జీవోస్‌ సభ్యులు రామినేని శ్రీనివాస్‌, ఉమాదేవి, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్‌, టీఎన్జీవోస్‌ నగర అధ్యక్షుడు శ్రీరామ్‌ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు