logo

Hyderabad: పుష్పక్‌ టిక్కెట్‌తో సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

శంషాబాద్‌ విమానాశ్రయంలో పుష్పక్‌ బస్సు ఎక్కినవారు నగరంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సదుపాయాన్ని టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ అందుబాటులోకి తెచ్చింది.

Updated : 12 Aug 2023 08:33 IST

ఫ్రీడం ఆఫర్‌

ఈనాడు - హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో పుష్పక్‌ బస్సు ఎక్కినవారు నగరంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సదుపాయాన్ని టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ అందుబాటులోకి తెచ్చింది. పుష్పక్‌ బస్సులో టిక్కెట్‌ కొన్న క్షణం నుంచి 3 గంటలపాటు ఈ ఉచిత ప్రయాణ సౌలభ్యాన్ని వినియోగించుకోవచ్చని అధికారులు చెప్పారు. విమానాశ్రయం నుంచి పుష్పక్‌ బస్సులు కొన్ని ప్రధాన ప్రాంతాలకే పరిమితమైనందున, తర్వాత ప్రయాణంలో ఈ వెసులుబాటు కల్పించామన్నారు. ఎయిర్‌పోర్టు స్టాపులో టిక్కెట్‌ కొన్నవారికే ఇది వర్తిస్తుందని.. దారిలో బస్సు ఎక్కినవారికి కాదని పేర్కొన్నారు.


రూ.59కే మెట్రోలో అపరిమితం

ఈనాడు, హైదరాబాద్‌: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌ మెట్రో రైల్‌(హెచ్‌ఎంఆర్‌) ప్రయాణికులకు ప్రత్యేక ఆఫర్‌ ప్రకటించింది. రోజుకు రూ.59తో సూపర్‌ సేవర్‌ మెట్రో హాలిడే కార్డ్‌ను రీఛార్జ్‌ చేయడం ద్వారా ఈనెల 12, 13, 15 తేదీల్లో అపరిమితంగా మెట్రోలో ప్రయాణించవచ్చని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎల్‌టీఎమ్‌ఆర్‌హెచ్‌ఎల్‌ ఎండీ, సీఈఓ కేవీబీ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు