logo

సబిత.. నాలుగుసార్లు విజేత

ఎన్నికల్లో విజయం సాధించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. వార్డు సభ్యుడిగా గెలుపొందేందుకే పడరాని పాట్లు పడాల్సి వస్తుంది.

Published : 29 Oct 2023 04:18 IST

న్నికల్లో విజయం సాధించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. వార్డు సభ్యుడిగా గెలుపొందేందుకే పడరాని పాట్లు పడాల్సి వస్తుంది. అలాంటిది ఏకంగా నాలుగుసార్లు శాసనసభ్యురాలిగా ఎన్నిక కావడం అంటే మామూలు విషయం కాదు. ప్రస్తుత విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తన భర్త పటోళ్ల ఇంద్రారెడ్డి మరణానంతరం రాజకీయాల్లో అడుగుపెట్టి 2000, 2004లో చేవెళ్ల నుంచి 2009లో మహేశ్వరం నుంచి గెలిచి హ్యాట్రిక్‌ నమోదు చేసుకున్నారు. 2018లో మహేశ్వరం కాంగ్రెస్‌ అభ్యర్థిగా నాలుగోసారి గెలుపొందిన ఆమె.. తాజాగా ఐదోసారి భారాస నుంచి బరిలో నిలిచారు.

న్యూస్‌టుడే, మహేశ్వరం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని