logo

ప్రజలు సుఖశాంతులతో జీవించాలి

ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్య ఐశ్వర్యా లతో ఉండాలని భగవంతుడిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి తెలిపారు.

Published : 10 Apr 2024 01:14 IST

పరిగి, న్యూస్‌టుడే: ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్య ఐశ్వర్యా లతో ఉండాలని భగవంతుడిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి జరిగిన పంచాంగ శ్రవణంలో పాల్గొని మాట్లాడారు. అనంతరం టీచర్స్‌ కాలనీలోని దాసాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అశీర్వాదం పొందారు.

వికారాబాద్‌, న్యూస్‌టుడే: క్రోధి నామ తెలుగు నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలుకుతూ షడ్రుచుల ఉగాది పచ్చడి రుచిని ఆస్వాదిస్తూ ఉగాది పండుగను మంగళవారం ఘనంగా నిర్వహించారు.  

తాండూరు, న్యూస్‌టుడే: తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పట్టణంలోని శ్రీ భావిగీ భద్రేశ్వర స్వామి, పొట్లీ మహరాజ్‌ దేవాలయాల్లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది పొడవునా అందరికీ శుభాలు కలగాలని, సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.వేడుకల్లో పురపాలక సంఘం అధ్యక్షురాలు స్వప్న, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

తాండూరు టౌన్‌, న్యూస్‌టుడే: భావిగీ భద్రేశ్వర స్వామి దేవాలయం ఉత్సవాలకు మంగళవారం శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి చేతుల మీదుగా రథ చక్రాలకు పూజలు చేశారు. వచ్చే నెల నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయి.  

వికారాబాద్‌ మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: ప్రధాన అర్చకులు బస్వరాజు స్వామి   స్థానిక మల్లికార్జున దేవాలయంలో పంచాంగ శ్రవణం చేశారు. సాహితీ సమితి జిల్లా గౌరవ అధ్యక్షుడు సాంబశివశర్మ, జిల్లా అధ్యక్షుడు వీరకాంతం, డాక్టర్‌ ముద్ద భక్తవత్సలం, సాహితి సమితి ఉపాధ్యక్షుడు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఆర్యవైశ్య భవనంలో పురోహితులు కృష్ణ పంతులు, సుభాష్‌ శర్మ పంచాంగ పఠనం చేశారు. పుర అధ్యక్షురాలు మంజుల, ఆర్యవైశ్య సంఘం మహిళా ప్రతినిధులు, సంఘం అధ్యక్షుడు మాలె లక్ష్మణ్‌, ఉపాధ్యక్షుడు రఘనందన్‌, కార్యదర్శి సునీల్‌, స్థానికులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని