logo

18 నుంచి చిలుకూరు బాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు

‘క్రోధి’ నామ సంవత్సరంలో అన్ని శుభాలే జరుగనున్నట్లు చిలుకూరు బాలాజీ దేవాలయం మేనేజింగ్‌ కమిటీ కన్వీనర్‌ గోపాలకృష్ణస్వామి, ఆలయ అర్చకుడు సీఎస్‌ రంగరాజన్‌ పేర్కొన్నారు.

Published : 10 Apr 2024 01:29 IST

మొయినాబాద్‌, న్యూస్‌టుడే: ‘క్రోధి’ నామ సంవత్సరంలో అన్ని శుభాలే జరుగనున్నట్లు చిలుకూరు బాలాజీ దేవాలయం మేనేజింగ్‌ కమిటీ కన్వీనర్‌ గోపాలకృష్ణస్వామి, ఆలయ అర్చకుడు సీఎస్‌ రంగరాజన్‌ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం చిలుకూరు బాలాజీ ఆలయ ఆవరణలో పంచాంగ పఠనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు.   బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుంచి 25 వరకు జరగనున్నాయి. 21న బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన బాలాజీ, పద్మావతి, అలివేలుమంగమ్మల కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. 25న చక్రతీర్థంతో బ్రహ్మోత్సవాలను ముగించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని