logo

తెలంగాణ ఉద్యమంలో పీఆర్టీయూది కీలక పాత్ర

మలిదశ తెలంగాణ ఉద్యమంలో పీఆర్టీయూ కీలకపాత్ర పోషించిందని ఆ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మంచిరెడ్డి అనంతరెడ్డి అన్నారు.

Published : 10 Apr 2024 01:33 IST

కర్మన్‌ఘాట్, న్యూస్‌టుడే: మలిదశ తెలంగాణ ఉద్యమంలో పీఆర్టీయూ కీలకపాత్ర పోషించిందని ఆ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మంచిరెడ్డి అనంతరెడ్డి అన్నారు. సంఘం ఆవిర్భావ వేడుకలను ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం హస్తినాపురంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అనంతరెడ్డి, ముఖ్య సలహాదారు గజ్జల జనార్దన్‌రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీనివాసరావులు సంఘం జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రత్యేక ఉద్యమం సమయంలో 2011 ఏప్రిల్‌లో గాలి హర్షవర్ధన్‌రెడ్డి సారధ్యంలో తెలంగాణ పీఆర్టీయూ రూపుదిద్దుకుందన్నారు. ఓ వైపు ఉద్యమంలో పాల్గొంటూనే, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేసిందన్నారు. ఈ సందర్భంగా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అనంతరెడ్డిని సత్కరించారు. రంగారెడ్డి, వికారాబాద్‌, హైదరాబాద్‌ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు కరుణాకర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీశైలం, మల్లేశ్‌, వెంకట్రెడ్డి, చెన్న కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని