logo

ఫిల్మ్‌నగర్‌లో నాటకోత్సవాలు ప్రారంభం

ఫిల్మ్‌నగర్‌లోని ఫిల్మ్‌ఛాంబర్‌ ఆవరణలోని డి.రామానాయుడు కళామండపంలో ఉగాది పండుగ సందర్భంగా ఏటా నిర్వహించే రంగస్థల నాటకోత్సవాలు మంగళవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి.

Published : 10 Apr 2024 01:42 IST

ఫిలింనగర్‌, న్యూస్‌టుడే: ఫిల్మ్‌నగర్‌లోని ఫిల్మ్‌ఛాంబర్‌ ఆవరణలోని డి.రామానాయుడు కళామండపంలో ఉగాది పండుగ సందర్భంగా ఏటా నిర్వహించే రంగస్థల నాటకోత్సవాలు మంగళవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు గుణనిధి నాటకాన్ని ప్రదర్శించారు. శ్రీకృష్ణుడిగా ఎ.కోటేశ్వరరావు, అర్జునుడిగా నంది అవార్డు గ్రహిత మంగదేవి నర్తించారు. శ్రీనాథ కవిసార్వభౌమ కాశీఖండం మూలకథ నుంచి సేకరించిన కథతో వెంకటచార్యులు నాటక రచన చేశారు. గుణనిధిగా వెంకటసాయిచంద్‌, యజ్ఞ దత్తుడిగా వెంకటచార్యులు, మార్తండవర్మగా మంతోజ సాళ్యాచారి, మతిమంతుడిగా ప్రసాదరాయ శాస్త్రి, విశారదుడిగా జంగయ్యగౌడ్‌ మెప్పించారు. రాజనాల సత్య దర్శకత్వం వహించారు. ఈ ప్రదర్శనను ఫిల్‌్్మనగర్‌ కో-ఆపరేటీవ్‌ హౌసింగ్‌ సొసైటీ అధ్యక్షుడు ఆదిశేషగిరిరావు, కార్యదర్శి కాజ సూర్యనారాయణ, కమిటీ సభ్యుడు జె.బాలరాజు, సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, ఎఫ్‌ఎన్‌సీˆసీˆ కార్యదర్శి ముళ్లపూడి మోహన్‌, నిర్వాహకులు పొత్తూరి వెంకటసుబ్బారావు వీక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని