logo

ఓటు స్ఫూర్తితో.. వైకుంఠపాళి

ఎక్కువ మందితో ఓటు వేయించాలన్న లక్ష్యంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ ఆకర్షణీయమైన ఓటరు చైతన్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

Published : 10 Apr 2024 01:52 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎక్కువ మందితో ఓటు వేయించాలన్న లక్ష్యంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ ఆకర్షణీయమైన ఓటరు చైతన్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నగరవ్యాప్తంగా పాఠశాలలు, ఇతర విద్యాసంస్థల్లో అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగా ‘‘మీ ఓటు ఉందా? లేదా? పరిశీలించుకోండి. ఓటు వేసేటప్పుడు మీతో ఓటరు గుర్తింపుకార్డును లేదా ఏదైన ప్రభుత్వ గుర్తింపుకార్డులను తీసుకెళ్లండి. ప్రలోభాలకు ప్రభావితం కాకుండా స్వేచ్ఛగా, మీ సొంత నిర్ణయం ప్రకారం ఓటేయండి’’అని రకరకాల సందేశాలను తెలిపే వైకుంఠపాళి ఆటను విద్యార్థులతో ఆడిస్తున్నారు. పోలింగ్‌ రోజున చేయకూడని పనులను కూడా ఆటలో చేర్చి ఓటర్లలో అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని