logo

అనుమతులన్నీ సువిధతోనే

ఎన్నికల నేపథ్యంలో ఈసీ సైతం ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలు జరగకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. సాంకేతికతను ఉపయోగించి ఓటింగ్‌ ప్రక్రియను సులభతరం చేయడంతోపాటు ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు కృషి చేస్తోంది.

Updated : 10 Apr 2024 04:42 IST

ప్రత్యేక పోర్టల్‌ను తీసుకొచ్చిన ఈసీఐ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఎన్నికల నేపథ్యంలో ఈసీ సైతం ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలు జరగకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. సాంకేతికతను ఉపయోగించి ఓటింగ్‌ ప్రక్రియను సులభతరం చేయడంతోపాటు ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు కృషి చేస్తోంది. ర్యాలీలు మొదలుకొని ప్రదర్శనల వరకు ఎలాంటి అనుమతులు కావాలన్నా సంబంధిత అధికారులు, పోలీసుల నుంచి కచ్చితంగా తీసుకోవాల్సిందే..ఇందుకోసం ఎన్నికల కమిషన్‌ ‘సువిధ పోర్టల్‌’ను అందుబాటులోకి తెచ్చింది. దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో అనుమతులు లభిస్తాయి.

అన్ని ప్రచార అనుమతులకు.. అభ్యర్థులు ముందుగా https://suvidha.eci.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్‌ అవ్వాలి. అనంతరం మీటింగ్‌లు, ర్యాలీలు, వాహనాలు, తాత్కాలిక పార్టీ కార్యాలయం ఏర్పాటు, హెలికాప్టర్‌, హెలిప్యాడ్‌, ఇంటింటి ప్రచారం, బ్యానర్లు, పార్టీ జెండాలు, ఎయిర్‌ బెలూన్లు, వీడియో వ్యాన్‌లు, హోర్డింగ్‌ల ఏర్పాటు, కరపత్రాల పంపిణీ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలి. సువిధ పోర్టల్‌ ద్వారా నామినేషన్‌ సమర్పించే వెసులుబాటు సైతం ఉంది. ఆఫ్‌లైన్‌లోనూ నియోజకవర్గ కేంద్రంలోని ఎన్నికల కార్యాలయంలో ప్రచార అనుమతులకు దరఖాస్తు చేసుకోవచ్చు.


న్నికల ప్రకటన విడుదలైనప్పటి నుంచి ఈ నెల 7 తేదీ వరకు ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా సువిధ పోర్టల్‌ ద్వారా 73,379 దరఖాస్తులు రాగా.. అందులో తెలంగాణ నుంచి 836 ఉన్నాయి. 44,626 (60 శాతం) దరఖాస్తులకు అనుమతి లభించగా.. 11,200 (సుమారు 15 శాతం) తిరస్కరించారు. 10,819 దరఖాస్తులను నకిలీగా గుర్తించారు. మిగిలినవి పరిశీలనలో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని