logo

నగరానికి శోభ.. రామమయం యాత్ర

వీధులన్నీ రామనామంతో  మార్మోగాయి.. కాషాయ జెండాలు రెపరెపలాడాయి..  భాగ్యనగర శ్రీరామ    నవమి ఉత్సవ సమితి, శ్రీరామ్‌ యువసేన ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం శోభాయాత్రలు నిర్వహించారు

Updated : 18 Apr 2024 04:17 IST

మహిళల సందడి

న్యూస్‌టుడే, గోషామహల్‌, బేగంబజార్‌, సుల్తాన్‌బజార్‌ : వీధులన్నీ రామనామంతో  మార్మోగాయి.. కాషాయ జెండాలు రెపరెపలాడాయి..  భాగ్యనగర శ్రీరామ    నవమి ఉత్సవ సమితి, శ్రీరామ్‌ యువసేన ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం శోభాయాత్రలు నిర్వహించారు. సీతారాంబాగ్‌ నుంచి, ధూల్‌పేట్‌ ఆకాశ్‌పురి హనుమాన్‌ దేవాలయం నుంచి వేర్వేరుగా ప్రారంభమయ్యాయి. ఒకటి కోఠి వరకు, మరొకటి సుల్తాన్‌బజార్‌లోని హనుమాన్‌ వ్యాయామశాల మైదాన్‌ వరకు సాగాయి. రాత్రి 11.30 గంటలకు యాత్రలు ముగిశాయి.

- హిందువులంతా సంఘటితమై ప్రపంచానికి ఐక్యతను చాటాలి. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ, అఖండ హిందూ రాజ్యస్థాపనకు ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలి.

 - చైతన్యానంద్‌ మహారాజ్‌,  దిల్లీ పిఠాధిపతి

 - హైదరాబాద్‌లో నిర్వహించే ఈ శోభాయాత్ర ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది.
- భగవంత్‌రావు, అధ్యక్షుడు, ఉత్సవ సమితి
- మోదీ నాయకత్వంలో అనేక క్లిష్ట సమస్యలు పరిష్కారమయ్యాయి. భారత్‌ను అఖండ హిందూ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి.
- రాజాసింగ్‌, ఎమ్మెల్యే, గోషామహల్‌
 

గదతో గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని