Anirudh: ‘చలేయా’ రీక్రియేట్‌ చేసిన అనిరుధ్‌.. వీడియో వైరల్‌

‘జవాన్‌’ (Jawan)లోని ‘చలేయా’ పాటను రీ క్రియేట్‌ చేశారు అనిరుధ్‌ (Anirudh). దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Published : 15 Sep 2023 16:08 IST

ముంబయి: ‘జవాన్‌’ (Jawan)తో సంగీత దర్శకుడిగా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు అనిరుధ్‌ (Anirudh). షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) - నయనతార (Nayanthara) జంటగా నటించిన ‘జవాన్‌’కు అనిరుధ్‌ అందించిన సంగీతం విశేష ఆదరణ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ‘చలేయా’ (Chaleya) పాట పలు మ్యూజిక్‌ యాప్స్‌లో రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఈ పాటను తాజాగా అనిరుధ్‌ రీక్రియేట్‌ చేశారు. ‘చలేయా’ పాట పాడుతూ దానికి అనుగుణంగా కీబోర్డును ప్లే చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను నెట్టింట షేర్‌ చేశారు. ‘‘చాలా రోజులైంది. ఇప్పుడు మీరు ఎంతగానో అభిమానించిన ‘చలేయా’తో మీ ముందుకు వచ్చా’’ అని ట్వీట్‌ చేశారు.

అనిరుధ్‌ షేర్‌ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. దీనిపై షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) స్పందించారు. ‘‘బేటా.. నువ్వు ఈ పాట పాడితే నేను డ్యాన్స్‌ చేస్తా. ఒకవేళ నేను ఏదైనా స్టెప్‌ తప్పుగా వేస్తే.. దానికి అనుగుణంగా నువ్వు రిథమ్‌ మార్చెయ్‌. దాంతో, నా డ్యాన్స్‌ అందరికీ మంచిగా కనిపిస్తుంది. నువ్వు సంగీతంతో మ్యాజిక్‌ చేయగలవని నాకు తెలుసు’’ అని రిప్లయ్‌ ఇచ్చారు.

Changure Bangaru Raja Review: రివ్యూ: ఛాంగురే బంగారురాజా

అట్లీ దర్శకత్వం వహించిన ‘జవాన్‌’ సెప్టెంబర్‌ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్‌హిట్‌ అందుకుంది. మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం ఇప్పటి వరకూ రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. ఇక ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే అనిరుధ్‌ - షారుక్‌ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అనిరుధ్‌ తనకు బిడ్డ లాంటి వాడని ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో షారుక్‌ చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని