New Year: సినీ పరిశ్రమ గతేడాది అద్భుతాలు చూసింది.. న్యూ ఇయర్‌ విషెస్‌ చెప్పిన ప్రముఖులు

సినీ ప్రముఖులు నూతన సంవత్సర (New Year) శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్‌లు పెడుతున్నారు.

Updated : 01 Jan 2024 11:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్త ఆశలతో నూతన సంవత్సరం వచ్చేసింది. ప్రపంచమంతా న్యూ ఇయర్‌కు స్వాగతం పలుకుతోంది. సెలబ్రిటీలు వారి అభిమానులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ సందర్భంగా అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) 2023 తెలుగు సినీ పరిశ్రమ అందుకొన్న విజయాల గురించి పోస్ట్‌ చేశారు.

‘‘2023 టాలీవుడ్‌కు, భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చారిత్రక సంవత్సరం. ఆస్కార్‌, గోల్డెన్‌ గ్లోబ్‌, జాతీయ అవార్డులు, బాక్సాఫీస్‌ బ్లాక్‌ బస్టర్‌లు.. ఇలా ఎన్నో సొంతం చేసుకుంది. ఎన్నో సరిహద్దులను దాటాం. పెద్ద విషయాల గురించి కలలుకనే ధైర్యం వచ్చింది. వాటిని సాకారం చేసుకునేందుకు ప్రయత్నిద్దాం. గతేడాది అందించిన అద్భుతమైన విజయాల జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. 2024కు స్వాగతం చెబుదాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు’’ - చిరంజీవి

‘‘ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు అందించిన ప్రేమ, ప్రశంసలు నాకు చెప్పలేనంత ఆనందాన్నిచ్చాయి. ఇలాంటి అనుభవాలను మీకు అందిస్తూనే ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు’’- సదీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga).

‘‘కొత్త సంవత్సరం  వచ్చేసింది. అంకితభావంతో అలుపెరుగని ప్రయత్నాలతో కొత్త శిఖరాలను చేరుకునేందుకు ప్రయత్నిద్దాం. కొత్త సవాళ్లను ఎదుర్కొంటూ.. విజయాలను అందుకుందాం’’ - కమల్ హాసన్‌ (Kamal haasan).

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని