Chiranjeevi: అభిమానులకు పండగే.. మెగా ఫ్యామిలీ ఫుల్‌ ఫొటో చూశారా!

సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ చిరంజీవి ఓ ఫొటో షేర్ చేశారు. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

Published : 16 Jan 2024 02:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక్క ఫొటోతో మెగా అభిమానుల్లో ఫుల్‌ జోష్‌ నింపారు చిరంజీవి (Chiranjeevi). నాలుగు రోజుల నుంచి సంక్రాంతి సంబరాలు వీరింట ఘనంగా జరుగుతున్నాయి. చిరంజీవి - అల్లు అరవింద్‌ కుటుంబ సభ్యులందరూ బెంగళూరులోని రామ్‌చరణ్‌ ఫామ్‌హౌస్‌కు చేరుకొని అక్కడ వేడుక చేసుకుంటున్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ చిరు ఈరోజు ఓ ఫొటోను షేర్‌ చేశారు. అందులో మెగా కుటుంబానికి చెందిన అందరూ ఉండడంతో నెటిజన్ల ఆనందం అంబరాన్నంటింది.

అందరూ రెడ్‌ అండ్‌ వైట్‌ కలర్‌ డ్రెస్‌లు ధరించిన ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇందులో అకీర స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాడంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. పవన్‌ కూడా ఉండుంటే ఫ్రేమ్‌ పర్‌ఫెక్ట్‌ అయ్యేదంటూ మరొకరు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏ పండగ వచ్చినా చిరంజీవి కుటుంబమంతా గెట్‌ టు గెదర్‌ అవుతారు. గతేడాది మెగా వారసురాలు క్లీంకార జన్మించడం, వరుణ్‌ తేజ్‌-లావణ్యల పెళ్లి జరగడంతో ఈ సంక్రాంతి మరింత ప్రత్యేకంగా నిలిచింది. ఇక నేడు చిరంజీవి అప్‌కమింగ్‌ సినిమా పేరు కూడా ప్రకటించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని