Vasista: రామ్‌ చరణ్‌తో ఆ స్థాయి సినిమా.. క్లారిటీ ఇచ్చిన వశిష్ఠ

రామ్ చరణ్‌తో ‘బాహుబలి’ లాంటి సినిమా తీయనున్నట్లు వస్తోన్న వార్తలపై దర్శకుడు వశిష్ఠ వివరణ ఇచ్చారు.

Updated : 18 Jan 2024 16:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘బింబిసార’తో గుర్తింపు తెచ్చుకొన్న వశిష్ఠ రెండో సినిమానే చిరంజీవితో చేసే అవకాశాన్ని అందుకున్నారు. ఆయన దర్శకత్వంలో చిరు (Chiranjeevi) నటిస్తోన్న చిత్రం ‘విశ్వంభర’. తాజాగా వశిష్ఠ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామ్‌ చరణ్‌తో తాను ఓ సినిమా తీయనున్నట్లు వస్తోన్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు.

‘రామ్ చరణ్‌తో (Ram charan) నేను ‘బాహుబలి’ లాంటి సినిమా తీయనున్నట్లు వార్తలొచ్చాయి. కానీ, నేనెప్పుడూ ఆ విషయం గురించి ప్రస్తావించలేదు. ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి సినిమా గురించి మాట్లాడితే రామ్‌చరణ్‌తో అనుకొని రాసేశారు. చిరుతో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ లాంటి ఫాంటసీ సినిమా చేయాలనుందని చెప్పానంతే. చరణ్‌తో ప్రాజెక్ట్‌ గురించి మాట్లాడలేదు. నాకు ఫాంటసీ కథలంటే ఇష్టం. అందుకే వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. ‘బింబిసార’ సీక్వెల్‌కు నేను దర్శకత్వం వహించడం లేదు. ఆ సినిమా విషయంలో నా ఐడియాలజీ వేరుగా ఉంది. ఈలోపు నాకు ‘విశ్వంభర’ అవకాశం వచ్చింది. ఆ విషయాన్ని కల్యాణ్‌రామ్‌తో చెప్పి ఆయన అనుమతి తీసుకొనే ‘బింబిసార2’ నుంచి బయటకు వచ్చాను’ అన్నారు.

జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే..: సమంత

ఇక చిరంజీవి ‘విశ్వంభర’ (Vishwambhara) షూటింగ్ ప్రస్తుతం మారేడుమిల్లిలో శరవేగంగా జరుగుతోంది. ఇటీవల విడుదల చేసిన దీని కాన్సెప్ట్‌ వీడియో ప్రేక్షకాదరణ పొందింది. రామ్‌చరణ్ కూడా దీనిపై ప్రశంసలు కురిపించారు. ఆసక్తికరంగా ఉందని కామెంట్ చేసి.. చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులో చిరు సరసన అనుష్కశెట్టి, మృణాల్ ఠాకూర్‌లు నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని