Mansoor Ali Khan: మన్సూర్‌కు ఎదురుదెబ్బ.. జరిమానా విధించిన మద్రాస్‌ హైకోర్టు

మన్సూర్‌కు మద్రాస్‌ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన వేసిన పరువు నష్టం కేసును న్యాయస్థానం కొట్టివేసింది.

Published : 22 Dec 2023 17:49 IST

చెన్నై: నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ (Mansoor Ali Khan)కు మద్రాస్‌ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చిరంజీవి, త్రిష, ఖుష్బూలపై ఆయన వేసిన పరువు నష్టం కేసును శుక్రవారం న్యాయస్థానం కొట్టివేసింది. ఫేమ్‌ పొందడం కోసమే మన్సూర్‌ ఇలాంటి పనులకు పాల్పడ్డాడంటూ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవానికి ఈ కేసు మన్సూర్‌పై త్రిష పెట్టాలని తెలిపింది. నటిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆయనకు రూ.లక్ష జరిమానా విధించింది. అడయార్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కు ఆ డబ్బును అందజేయాలని ఆదేశించింది.

అసలేం జరిగిందంటే:

‘లియో’ విడుదలైన తర్వాత మన్సూర్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. గతంలో తాను ఎన్నో రేప్‌ సీన్లలో నటించానని.. ‘లియో’లో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో కూడా అలాంటి సన్నివేశం ఉంటుందనుకున్నానని చెప్పారు. ఆ సన్నివేశం లేకపోవడం తనని బాధించిందన్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లియో’ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌, ప్రముఖ హీరో చిరంజీవి, నితిన్‌, రోజా, రాధిక, గాయని చిన్మయి తదితరులు మన్సూర్‌ వ్యాఖ్యలను ఖండించారు. సామాజిక మాధ్యమాల వేదికగా త్రిషకు మద్దతు తెలిపారు. ఈ క్రమంలోనే చిరంజీవి, ఖుష్బూ, త్రిష వల్ల తన పరువుకు భంగం కలిగిందని మన్సూర్‌ ఆరోపణలు చేశారు. సోషల్‌మీడియా వేదికగా వాళ్లు చేసిన వ్యాఖ్యలు తనని ఎంతో బాధపెట్టాయన్నారు. దాదాపు రూ.కోటి డిమాండ్‌ చేస్తూ వారి ముగ్గురిపై పరువు నష్టం దావా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని