Naga Chaitanya: నాగచైతన్య తొలి వెబ్‌ సిరీస్‌.. స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్

ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు నటుడు నాగచైతన్య (Naga Chaitanya) సిద్ధమయ్యారు. ఆయన నటించిన తొలి వెబ్‌ సిరీస్‌ ‘ధూత’ స్ట్రీమింగ్‌ డేట్‌ వచ్చేసింది.

Updated : 15 Nov 2023 15:05 IST

హైదరాబాద్‌: నటుడు నాగచైతన్య (Naga Chaitanya) నటించిన తొలి వెబ్‌ సిరీస్‌ ‘ధూత’ (Dhootha). సూపర్‌ నేచురల్‌ హారర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌కు విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించారు. కొన్ని నెలల క్రితమే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ రిలీజ్‌కు తాజాగా ముహూర్తం ఖరారైంది. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా డిసెంబర్‌ 1 నుంచి ఇది ప్రసారం కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘ధూత’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఓటీటీ సంస్థ నెట్టింట షేర్‌ చేసింది. దీంతో Dhootha, Naga Chaitanya హ్యాష్‌ట్యాగ్స్‌ నెట్టింట ట్రెండ్‌ అవుతున్నాయి.

Karthika Nair: కాబోయే భర్తను పరిచయం చేసిన ‘రంగం’ బ్యూటీ

ఎనిమిది ఎపిసోడ్స్‌తో ఈ సిరీస్‌ను తీర్చిదిద్దారు. ఇందులో సాగర్‌ అనే జర్నలిస్ట్‌ పాత్రలో చైతన్య కనిపించనున్నారు. ఆయన రోల్‌ ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండనుంది. ప్రియా భవానీ శంకర్‌ కథానాయిక. ‘మనం’ తర్వాత విక్రమ్‌- నాగచైతన్య కాంబినేషన్‌లో ‘థ్యాంక్‌ యు’ అనే చిత్రం రూపొందింది. ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న ప్రాజెక్ట్‌ ఇదే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని