Rajamouli: చాలారోజుల తర్వాత ఇలా.. సరికొత్త చిత్రాలపై రాజమౌళి రివ్యూ..!

ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) తాజాగా రెండు చిత్రాలు బ్యాక్‌ టు బ్యాక్‌ వీక్షించారు. ఆయా చిత్ర బృందాలను మెచ్చుకుంటూ ఆయన ట్వీట్స్‌ చేశారు.

Published : 08 Sep 2023 18:35 IST

హైదరాబాద్‌: ఓ వైపు షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) నటించిన ‘జవాన్‌’ (Jawan).. మరోవైపు అనుష్క, నవీన్‌ పొలిశెట్టి (Anushka Shetty) నటించిన ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) చిత్రాలు ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతున్నాయి. సినీ ప్రముఖులు సైతం ఈ చిత్రాలను వీక్షించి తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) తాజాగా ఈ సినిమాలు చూశారు. రెండు చిత్రబృందాలను మెచ్చుకుంటూ ఆయన ట్వీట్స్‌ చేశారు.

‘‘చాలా రోజుల తర్వాత బ్యాక్‌ టు బ్యాక్‌ రెండు చిత్రాలు చూశా. స్వీటీ ఎప్పటిలాగే అందంగా మెరిసిపోయింది. నవీన్‌ పొలిశెట్టి.. తన నటనతో వినోదాన్ని మెండుగా అందించాడు. బాక్సాఫీస్‌ వద్ద విజయాన్ని అందుకున్న ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’ బృందానికి, ముఖ్యంగా ఇలాంటి సున్నితమైన అంశాన్ని వినోదాత్మకంగా చెప్పిన దర్శకుడు మహేశ్‌బాబు ప్రత్యేక అభినందనలు’’

రివ్యూ: జవాన్‌.. షారుక్‌, నయనతార యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

‘‘షారుక్‌ఖాన్‌ను బాక్సాఫీస్‌ బాద్‌షా అని ఇందుకే అంటారు. అత్యద్భుతమైన ఓపెనింగ్‌తోనే అదరగొట్టేశారు. ఉత్తరాదిలోనూ విజయ దుందుభిని కొనసాగిస్తున్నందుకు కంగ్రాట్స్‌ అట్లీ. ఘన విజయాన్ని అందుకున్న జవాన్‌ టీమ్‌కు నా ప్రత్యేక అభినందనలు’’ అని రాజమౌళి ట్వీట్స్‌ చేశారు. దీనిపై షారుక్‌ స్పందించారు. ‘‘థ్యాంక్యూ సో మచ్‌ సర్‌. సినిమా విషయంలో మీకు ఉన్న సృజనాత్మకత నుంచే మేమంతా నేర్చుకుంటున్నాం. వీలుంటే ఒక్కసారి కాల్‌ చేయండి. నేను మాస్‌ హీరో కాగాలనో లేదో చెప్పండి’’ అని రిప్లై ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని