Thalaivar 170: ‘జై భీమ్‌’ దర్శకుడితో తలైవా.. సినిమా పక్కా హిట్‌ అంటోన్న అభిమానులు

ప్రముఖ హీరో రజనీకాంత్‌ (Rajinikanth)తన 170వ చిత్రాన్ని ప్రకటించాడు. ఈ సినిమాకు (Thalaiva 170) ‘జై భీమ్‌’తో ప్రశంసలు అందుకున్న టీజే జ్ఞానవేల్‌ (TG Gnanavel) దర్శకత్వం వహించనున్నారు.

Published : 02 Mar 2023 15:39 IST

హైదరాబాద్‌: స్టైల్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే హీరో రజనీకాంత్ (Rajinikanth)‌. వయసుతో సంబంధం లేకుండా నేటి నటీనటులతో పోటీపడుతూ వరస సినిమాలతో అలరిస్తుంటాడు. తాజాగా ఆ హీరో ఫ్యాన్స్‌కు మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రోడక్షన్స్ (Lyca Productions)‌. త్వరలోనే తలైవా 170వ (Thalaiva 170) చిత్రాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించింది. ఇక ఈ సినిమాకు సెన్సేషనల్‌ దర్శకుడిని రంగంలోకి దింపడంతో తలైవా ఫ్యాన్స్‌ ‘సినిమా పక్కాగా హిట్‌’ అని కామెంట్స్‌ చేస్తూ ఖుషీ అవుతున్నారు.

‘జై భీమ్‌’ (Jai Bhim) సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ఎన్నో పురస్కారాలను అందుకున్నారు దర్శకుడు టీజే జ్ఞానవేల్‌ (TG Gnanavel). ఇప్పుడీ టాలెంటెడ్‌ దర్శకుడు రజనీకాంత్‌ 170 (Thalaiva 170)వ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఇక ఈ సినిమాకు యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ సంగీతం అందించనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ట్వీట్‌ చేసింది. ‘‘సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో కలిసి పనిచేయడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నాం’’ అని పేర్కొంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలపనున్నారు. 

ప్రస్తుతం రజనీకాంత్‌ ‘జైలర్‌’ (Jailer) సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. దీని తర్వాత ఆయన కుమార్తె ఐశ్వర్య (Aishwarya Rajinikanth) దర్శకత్వంలో ‘లాల్‌ సలాం’ (Lal Salaam) సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాను కూడా లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తుండగా.. ఏ ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రముఖ టాలీవుడ్‌ నటి జీవితా రాజశేఖర్‌ (Jeevitha Rajasekhar) కీలకపాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. రజనీకాంత్‌కు చెల్లెలి పాత్రలో ఆమె నటించనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని