BharOS: దేశీయ మొబైల్ ఓఎస్ ‘భారోస్’ ఫీచర్లివే..!
స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మరో కొత్త మొబైల్ ఓఎస్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఎలాంటి డీఫాల్ట్ యాప్‌లు ఉండవు. యూజర్ల తమకు అవసరమైన యాప్‌లను మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
చెన్నై: దేశీయంగా స్మార్ట్‌ఫోన్ (Smartphone) యూజర్లకు మరో కొత్త ఓఎస్ (Mobile OS) అందుబాటులోకి వచ్చింది. భారోస్ (BharOS) పేరుతో ఐఐటీ మద్రాస్ (IIT Madras), జండ్‌కాప్స్ సంస్థ (JandK Operations Private Limited) సంయుక్తంగా ఈ ఓఎస్‌ను రూపొందించాయి. కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ నిధులతో ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా ఈ సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసినట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా 100 కోట్ల మొబైల్ వినియోగదారుల సమాచారం భద్రంగా ఉండేలా, సౌకర్యంగా వినియోగించుకునేలా ఇది ఉంటుందని వెల్లడించింది. ఇంకా ఈ ఓఎస్ పనితీరు, ప్రయోజనాల గురించి ఏం చెబుతున్నారో చూద్దాం.
- ఈ ఓఎస్‌లో ఎలాంటి డీఫాల్ట్ యాప్‌లు ఉండవు. యూజర్ తనకు నచ్చిన, రోజువారీ అవసరాలకు ఉపయోగపడే యాప్‌లను ఎంపిక చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సాధారణంగా ఆండ్రాయిడ్ (Android) లేదా ఐఓఎస్ (iOS)లో కొన్ని యాప్‌లు డీఫాల్ట్‌గా వస్తాయి. యూజర్‌కు వాటి అవసరం లేకున్నా ఫోన్లో ఉండిపోతాయి. దీనివల్ల ఫోన్ మెమొరీపై భారం పడుతుంది. కానీ, భారోస్‌లో డీఫాల్ట్ యాప్స్ లేకపోవడం వల్ల యూజర్‌కు ఎక్కువ ఫోన్ మెమొరీ అందుబాటులో ఉంటుంది.
- భారోస్ ఇన్స్టాల్ చేసుకున్న ఫోన్లకు ప్రైవేట్ యాప్ స్టోర్ సర్వీస్ (PASS) అందుబాటులో ఉంటుంది. ఇందులో సురక్షితమైన, గోప్యతకు భంగం కలిగించని యాప్‌లు మాత్రమే ఉంటాయి. వీటిని టెక్ నిపుణులు వివిధ దశల్లో పరిశీలించిన అనంతరం పాస్‌లోకి అనుమతిస్తారు. దీనివల్ల యూజర్‌కు నమ్మకమైన యాప్‌లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. సాధారణంగా ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్‌లో ఉండే కొన్ని థర్డ్‌పార్టీ యాప్‌లు యూజర్ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుంటాయి. ఈ నేపథ్యంలో భారోస్ ద్వారా యూజర్లు పూర్తి సురక్షితమైన యాప్‌లను డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
- ఈ ఓఎస్‌కు సంబంధించిన అప్డేట్లు అన్ని నేటివ్ ఓవర్ ది ఎయిర్(NOTA) ద్వారానే వస్తాయని డెవలపర్స్ చెబుతున్నారు. దీనివల్ల యూజర్ ప్రమేయం లేకుండా ఓఎస్ అప్డేట్లు అన్ని ఆటోమేటిగ్గా ఇన్స్టాల్ అవుతాయి. ఫోన్ ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండటం వల్ల ఫోన్లో డేటా కూడా సురక్షితంగా ఉంటుందని అంటున్నారు.
- భారోస్‌తో ఫోన్ బ్యాటరీ పనితీరు మరింత మెరుగవుతుందని జాండ్‌కె కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం యూజర్ల ఫోన్లలో ఉన్న ఓఎస్‌ల కంటే భారోస్‌తో బ్యాటరీ పనితీరు రెండు నుంచి మూడు రెట్లు పెరుగుతుందని తెలిపింది. డీఫాల్ట్ యాప్స్ లేకపోవడం, యూజర్ తనకు అవసరమైన యాప్స్‌ను మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల బ్యాటరీపై భారం తగ్గుతుంది.
- ప్రస్తుతం ఈ ఓఎస్‌ను గోప్యత, భద్రత పరంగా సున్నితమైన సమాచారం వినియోగించే సంస్థలకు మాత్రమే అందిస్తున్నారు. ఒకవేళ ఏదైనా సంస్థ భారోస్‌ను ఉపయోగించాలనుకంటే ఆయా సంస్థలు ప్రైవేట్ 5జీ నెట్వర్క్ ద్వారా ప్రైవేటు క్లౌడ్ సేవలను ఉపయోగిస్తుండాలని డెవలపర్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆఫ్లైన్లోనూ గూగుల్ డాక్స్
గూగుల్ డాక్స్‌లో పనిచేస్తున్నారు. అంతలో ఇంటర్నెట్ కనెక్షన్ పోయింది. లేదూ ఏ మారుమూల ప్రాంతంలోనో ఇంటర్నెట్ అసలే అందుబాటులో లేదు -
ఒంటి చేత్తో యాపిల్ వాచ్
చేతిలో కాఫీ కప్పుంది. అంతలో స్మార్ట్‌వాచ్‌కు మెసేజ్ వచ్చింది. ఇలాంటి సమయంలో ఒంటి చేత్తోనే దానికి సమాధానం ఇస్తే? వచ్చే ఫోన్ కాల్‌ను రిసీవ్ చేసుకొని, మాట్లాడిన తర్వాత కట్టేస్తే? యాపిల్ వాచ్ అల్ట్రా 2, యాపిల్ వాచ్ సిరీస్ 9 స్మార్ట్‌వాచ్‌లతో ఇది సాధ్యమే. -
పిక్సెల్ ఫోన్లలోనూ కార్ క్రాష్ డిటెక్షన్
యాపిల్ అనంతరం గూగుల్ కూడా భారత్‌లో తమ పిక్సెల్ ఫోన్లలో ‘కార్ క్రాష్ డిటెక్షన్’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. కారు ప్రమాదానికి గురైనప్పుడిది ఎంతగానో ఆదుకుంటుంది. ఒకప్పుడు ఈ ఫీచర్ అమెరికాకే పరిమితం. ఇప్పుడు భారత్‌తో పాటు ఆస్ట్రియా, బెల్జియం, పోర్చుగల్, స్విట్జర్లాండ్ దేశాల్లోనూ అందుబాటులోకి వచ్చింది. -
సైబర్ భద్రత మనదే బాధ్యత
ఇంట్లోనే కాదు, ఆన్‌లైన్‌లోనూ దొంగలు పడతారు! కంటికేమీ కనిపించరు గానీ వ్యక్తిగత సమాచారం కాజేస్తారు. మాయమాటలు చెప్పో, బురిడీ కొట్టించో రహస్య వివరాలు లాగేస్తారు. -
కారెక్కడ పెట్టానబ్బా?
మాల్‌లోనో మరెక్కడో పార్కింగ్ స్థలంలో కారు, బైకు నిలిపారు. కానీ ఎక్కడ నిలిపారో గుర్తు లేదు. చాలాసేపు వెతికితే గానీ తెలియలేదు. -
QR Code: క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త
ఎడాపెడా క్యూఆర్ కోడ్లను స్కాన్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త. ముఖ్యంగా ఈమెయిళ్లకు వచ్చే క్యూఆర్కోడ్లను ఫోన్‌తో స్కాన్ చేసేటప్పుడు అప్రమత్తత అవసరం. వీటితో హ్యాకర్లు మోసాలకు పాల్పడే అవకాశముందని సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
చెట్లకు పీడల గండం
మనకు మాదిరిగానే చెట్లకూ జబ్బులు, ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇవి వాటికి హాని చేస్తాయి. ఆరోగ్యాన్ని, ఆకారాన్ని దెబ్బతీస్తాయి. పరిస్థితి తీవ్రమైతే చెట్లు చనిపోవచ్చు కూడా. ఇటీవల మనదేశంలో వేప చెట్లకు ఇలాంటి దుస్థితి తలెత్తటం తెలిసిందే. -
మంచి నీటికి కొత్త మార్గం
తాగునీటి అవసరాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. దీంతో సముద్రపు నీటిని మంచినీరుగా మార్చటమూ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఐఐటీ గువహటి శాస్త్రవేత్తలు రూపొందించిన వినూత్న విధానం కొత్త ఆశలు రేపుతోంది. -
పామాయిల్‌కు ప్రత్యామ్నాయం
ఆహార, సౌందర్య ఉత్పత్తుల్లో పామాయిల్‌ను విరివిగా వాడుతుంటారు. దీనికి రోజురోజుకీ గిరాకీ పెరుగుతుండటంతో పామ్ చెట్ల సాగుకు అడవులనూ నరుకుతున్నారు -
3డీ ముద్రిత మూత్ర పరీక్ష పరికరం
మహిళల్లో మూత్ర ఇన్ఫెక్షన్లు ఎక్కువ. వీటికి చికిత్స చేయటానికి ఇన్ఫెక్షన్ కారక బ్యాక్టీరియాను గుర్తించాల్సి ఉంటుంది. ఇందుకోసం బ్యాక్టీరియాను వృద్ధి చేసి, దాన్ని గుర్తిస్తారు. దీనికి రెండు, మూడు రోజులు పడుతుంది. -
ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి హైడ్రోజన్
ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణానికి పెనుముప్పుగా మారాయి. వీటిని హరిత హైడ్రోజన్‌గా మారిస్తే? విలువైన గ్రాఫైన్నూ సృష్టిస్తే? పరిశోధకులు అదే సాధించారు. -
సాలీడు పట్టు!
సాలె గూడు చాలా దృఢంగా ఉంటుంది. బరువు పరంగా చూస్తే స్టీలు కన్నా గట్టిగానూ ఉంటుంది! అత్యంత దృఢమైన సహజ పట్టు రకాల్లో సాలీడు ఉత్పత్తి చేసే పట్టుకే అగ్రస్థానం దక్కుతుంది. -
పసిఫిక్‌లో బంగారు గుడ్డు!
గురించి తెలిసింది కొంతే. తెలియని రహస్యాలు ఎన్నో. ఇటీవల పసిఫిక్ మహా సముద్రం అడుగున అలాంటి వింత ఒకటి బయటపడింది. గుండ్రంగా, బంగారు వర్ణంలో మెరుస్తోన్న ఇది శాస్త్రవేత్తలకే అమితాశ్చర్యం కలిగిస్తోంది. ‘ -
సహారా పూవై పూచెనే...
సహారా అనగానే ఇసుక దిబ్బలే గుర్తుకొస్తాయి. ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఇదే. సుమారు 92 లక్షల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇసుక దిబ్బలతో మేట వేసుకుపోయిన ఇది అప్పుడప్పుడూ పచ్చగా కళకళలాడుతూ ఉంటుందంటే నమ్ముతారా? -
iPhone 15: టెక్ ప్రియులకు పండగే.. ఐఫోన్ 15 వచ్చేసింది.. కొత్త ఫీచర్లు ఇవే..
టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ల, యాపిల్ వాచ్‌లను విడుదల చేసింది. ఈ ఫోన్లలో ఇచ్చిన ఫీచర్స్, ధరలు ఒకసారి పరిశీలిద్దాం.. -
లొకేషన్లకు నచ్చిన ఎమోజీ
గూగుల్ మ్యాప్స్‌లో లొకేషన్ సేవ్ చేసుకున్నారా? వాటిని చూడటం ఇకపై తేలిక కానుంది. సేవ్ చేసిన లొకేషన్లకు లవ్, ఆహారం, ఆటలు, పార్క్‌లు, గుడులు.. ఇలా రకరకాల ఎమోజీలను జోడించుకోవచ్చు మరి. ఇటీవలే గూగుల్ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. -
డ్రైవ్‌లోనే డాక్యుమెంట్ లాక్
గూగుల్ వర్క్‌స్పేస్ వాడుతున్నారా? సహోద్యోగులతో డాక్యుమెంట్స్ పంచుకుంటున్నారా? వాళ్లు మార్పులు, చేర్పులు చేస్తారేమోనని భయపడుతున్నారా? ఇకపై అలాంటి సందేహం అక్కర్లేదు. గూగుల్ డ్రైవ్‌లోనే ఫైళ్లను లాక్ చేసే సులభమైన కొత్త ఫీచర్ రాబోతోంది. -
Google Dark Web Report: చీకటి వెబ్‌కు గూగుల్ చెక్
ఏ సందేహం వచ్చినా వెంటనే గూగుల్ చేసేస్తాం. కొత్త చిరునామా వెతకాలన్నా, క్లిష్టమైన పదానికి సమాధానం తెలుసుకోవాలన్నా, సైన్స్ దగ్గర్నుంచి సాంకేతిక పరిజ్ఞానం వరకూ ఏ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నా ముందుగా తట్టేది గూగులమ్మ తలుపునే. -
క్రోమ్ బ్రౌజర్ ఐఫోన్ తెర అడుగున
సాంకేతిక రంగంలో యాపిల్ చూసే ప్రభావం అంతా ఇంతా కాదు. కంపెనీలు తమ ఆపరేటింగ్ సిస్టమ్‌లోనూ మార్పులు చేసేలా పురికొల్పుతుంది. -
గూగుల్ ఫొటోస్ మారింది
ఫొటోల సేవ్, ఎడిటింగ్ కోసం గూగుల్ ఫొటోస్ వాడేవారికి శుభవార్త. అధునాతన ఎడిటింగ్ టూల్స్ అందుబాటులోకి వచ్చాయి. -
పవర్ అప్ టూల్స్
కంప్యూటర్ పరిజ్ఞానం బాగా గలవారికి మైక్రోసాఫ్ట్ పవర్‌టాయ్స్ పరిచితమే. పీసీకి అద్భుతమైన ఫీచర్లు జోడించుకోవటానికిదో మంచి సదుపాయం. దీనికి ఎప్పటికప్పుడు కొత్త టూల్స్ తోడవుతూనే ఉంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
TS Elections - Congress: కాసేపట్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎంపిక
-
Telangana DGP: తెలంగాణ డీజీపీగా రవిగుప్తా నియామకం
-
IND vs AUS: ఆసీస్‌తో ఐదో టీ20.. తడబాటుకు గురవుతున్న భారత బ్యాటర్లు
-
Ashok Gehlot: కచ్చితంగా గెలుస్తామనుకున్నాం.. కానీ,: అశోక్ గహ్లోత్
-
Kishan Reddy: భాజపా ఓటు బ్యాంక్ 100 శాతం పెరిగింది: కిషన్‌రెడ్డి
-
TS Results: ‘కారు’కు నిరాశ.. ఆరుగురు మంత్రులకు షాక్