నానమ్మ ఆస్తిలో మనవలకి వాటా రాదా?
మాకు పెళ్లై పదేళ్లు అయ్యింది. ఇద్దరాడపిల్లలు. ఈ మధ్య నా భర్త ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. మా మామగారు ఇరవైఏళ్ల క్రితమే చనిపోయారు.
మాకు పెళ్లై పదేళ్లు అయ్యింది. ఇద్దరాడపిల్లలు. ఈ మధ్య నా భర్త ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. మా మామగారు ఇరవైఏళ్ల క్రితమే చనిపోయారు. అత్త, పెళ్లికాని మరిది మాత్రమే ఉన్నారు. అత్తపేరున రెండెకరాల పొలం, ఇల్లు ఉన్నాయి. మనవలకైనా సరే! ఏదీ ఇచ్చేది లేదని తెగేసి చెప్పేసిందావిడ. పిల్లల భవిష్యత్తుకి భరోసా ఇచ్చేలా ఆ ఆస్తి నుంచి ఏమైనా వచ్చే అవకాశం ఉందా?
మీ పరిస్థితి బాధాకరం. హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 14 ప్రకారం అది ఆవిడ స్వార్జితం అవుతుంది. మీ భర్త ఉద్యోగం ఏమైనా చేశారా? దాన్నుంచి మీకు ఏమీ రాలేదా? మీరు జాబ్ చేయడం లేదా? మీ పిల్లలకు, మీకు జీవనభృతి కోసం గృహహింస చట్టాన్ని ఉపయోగించుకోవచ్చు. మీరు పెళ్లప్పుడు ఇచ్చిన కట్నకానుకలు తిరిగి ఇమ్మని గృహహింస చట్టంలోని సెక్షన్ 20 కింద మెయింటెనెన్స్ అడగొచ్చు. మీ అత్తగారు అనుభవిస్తోన్న ఆస్తిలో నుంచి మెయింటెనెన్స్ కోరవచ్చు. మీకు రావాల్సిన కట్నం తాలూకు డబ్బు, మీ పెళ్లప్పుడు ఇచ్చిన కానుకలు, మీ భర్త సంపాదించిన ఆస్తులేవైనా ఉంటే ఈ చట్టంలోని సెక్షన్ 22 ప్రకారం వాటి తాలూకు ఆధారాలు చూపించి తిరిగి ఇవ్వమని అడగండి. వీటన్నింటికంటే ముందు మీకు దగ్గర్లోని మధ్యవర్తిత్వ కేంద్రానికి వెళ్లి ఫిర్యాదు ఇవ్వండి. వాళ్లు పిలిపించి చెప్పి చూస్తారు. ఒప్పుకోకపోతే అప్పుడు లీగల్ సర్వీసెస్ అథారిటీ వారిని సంప్రదిస్తే లాయర్ని ఏర్పాటు చేస్తారు. అప్పుడు కోర్టులోనే తేల్చుకోవచ్చు. ఏదైనా సరే త్వరగా నిర్ణయం తీసుకోండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- చెమటకు చుండ్రు తోడైతే...
- మొహాన్ని మెరిపిస్తాయి!
- అక్కడ వెంట్రుకలు తొలగించాలంటే..!
- ముత్యమంత మొటిమే కదా?
- ఈ గింజలతో అందంగా మెరిసిపోదాం!
ఆరోగ్యమస్తు
- పుట్టుకతోనే మెల్లకన్ను.. సరిచేయచ్చా?
- మండే వేసవిలో.. చల్లదనం.. పోషకాలు!
- డుకన్ డైట్... తెలుసా?
- వేసవిలో ఈ పండ్లు తింటున్నారా?
- గుండె పదిలంగా ఉండాలా...
అనుబంధం
- అది టెక్స్ట్లేషన్షిప్ మాత్రమే..!
- ఒక్క ఛాన్స్ తీసుకుందాం...
- ఈ రకం పెళ్లిళ్లలో ప్రేమకు, శృంగారానికి తావు లేదు!
- ఆడేద్దామా.. ఏడు పెంకులాట!
- డైపర్ ఎలా వచ్చిందంటే!
యూత్ కార్నర్
- Celebrity Fashion: అందాన్ని పెంచే ‘అజ్రఖ్’ ప్రింట్!
- వాళ్ల మాటలు విని సంతోషం ఆవిరైంది..!
- ఆ పుస్తకంలో మన ఆర్కిటెక్ట్స్..!
- ఈ మెకానిక్ తీరే వేరు!
- పసిప్రాణాలకు ‘రక్ష’ణగా..!
'స్వీట్' హోం
- చమేలీ... సుగంధాల రేరాణి!
- రామ చక్కని సీతకి...
- అబద్ధాలు చెబుతున్నారా?
- సెరామిక్ పాత్రలు.. ఎలా శుభ్రం చేయాలో తెలుసా?
- వంటకు సాయంగా..!
వర్క్ & లైఫ్
- ౩౫ ఏళ్లకే ఐదుగురు పిల్లలు.. ఒక మనవరాలు!
- మా మేనేజర్.. కోరిక తీర్చమని వేధిస్తున్నాడు..!
- భర్త నచ్చకపోతే విడాకులు.. గ్రాండ్గా ‘పార్టీ’..!
- పోటీలో నెగ్గాలంటే...
- అమ్మాయిలూ... ఓటేస్తున్నారా?