పట్టు చిక్కాలంటే... ప్రణాళిక ఉండాలి...

ఈతరం మహిళలు... ఇంటి నిర్వహణే కాదు... ఆఫీసు బాధ్యతల్నీ ఆత్మవిశ్వాసంతో అందిపుచ్చుకుంటున్నారు. అయితే, ఇక్కడ రాణించాలంటే కొంత నేర్పరితనం, మరికొన్ని మెలకువలనూ అలవరుచుకోవాలి.

Published : 26 Apr 2024 02:06 IST

ఈతరం మహిళలు... ఇంటి నిర్వహణే కాదు... ఆఫీసు బాధ్యతల్నీ ఆత్మవిశ్వాసంతో అందిపుచ్చుకుంటున్నారు. అయితే, ఇక్కడ రాణించాలంటే కొంత నేర్పరితనం, మరికొన్ని మెలకువలనూ అలవరుచుకోవాలి. అవేంటంటే...

  • పనులు సమర్థంగా పూర్తి చేయాలంటే దాని మీద కచ్చితమైన అవగాహన ఉండాలి. అప్పుడే వాటిల్లో దేనికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వాలో అర్థమవుతుంది. చక్కటి ప్రణాళిక వేసుకోగలుగుతారు. పని ఒత్తిడిని తగ్గించుకోగలరు.
  • పని ప్రదేశంలో సానుకూల వాతావరణం లేకపోతే అది ఉత్పాదకత మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అందరినీ కలుపుకొని పోవడం, ఉద్యోగుల సమస్యలపైనా దృష్టిపెట్టడం, వెనకబడిన వారికి చేయూతనివ్వడం వంటివన్నీ మీకు బలాన్ని చేకూరుస్తాయి. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా మీతో కలిసి పనిచేయడానికి వారూ ఆసక్తి చూపుతారు. ఆ బృంద స్ఫూర్తి కెరియర్‌లో ముందుకు వెళ్లేందుకు సాయం చేస్తుంది.
  • అందరికీ అన్నీ తెలిసి ఉండాలనేం లేదు. కానీ, ఎప్పటికప్పుడు మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ద్వారా మరింత వేగంగా, సమర్థంగా పనిచేయొచ్చు. అనుభవజ్ఞుల సలహాలు, సూచనలను పాటించడం ద్వారా పనిని మెరుగుపరుచుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్