ఆఫీసు కష్టాలు చెప్పే ఊలు బంతి!

మగవాళ్ల ఆధిపత్యం ఉండే ఆఫీసుల్లో అడుగుపెడితే మనమెంతగా ముడుచుకుపోతాం! బిడియపడతాం, ఆత్మవిశ్వాసం కోల్పోతాం... చివరికి వాళ్లని అనుకరించడానికి ప్రయత్నిస్తాం.

Published : 10 May 2024 02:04 IST

మగవాళ్ల ఆధిపత్యం ఉండే ఆఫీసుల్లో అడుగుపెడితే మనమెంతగా ముడుచుకుపోతాం! బిడియపడతాం, ఆత్మవిశ్వాసం కోల్పోతాం... చివరికి వాళ్లని అనుకరించడానికి ప్రయత్నిస్తాం. ఈ క్రమంలో మనల్ని మనం కోల్పోతూ గ్లాస్‌ సీలింగ్‌ని బద్ధలు కొట్టాలని వృథా ప్రయత్నం చేస్తాం. పని ప్రదేశంలో ఇటువంటి మహిళల కష్టాలని చెప్పే చిట్టి సినిమానే ఈ పర్ల్‌!.. బ్రో క్యాపిటల్‌ సంస్థలో గులాబీరంగు ఊలు బంతి పర్ల్‌కి ఉద్యోగం వస్తుంది. పేరుకు తగ్గట్టుగా బ్రోక్యాపిటల్‌ ఆఫీసులో అంతా అబ్బాయిలే. వాళ్లు వేసే కుళ్లు జోకులు వింటూ, వాళ్లతోపాటు కలిసి పనిచేయడానికి చాలా ఇబ్బంది పడుతుందీ గులాబీ బంతి. ఇక వాళ్లలా ఉండేందుకు తన ఊలుతో తనే కోటుని అల్లుకుని అబ్బాయిలా మారుతుంది కూడా. ఇంతలో మరో ఊలుబంతి కూడా చేరుతుందా ఆఫీసులో. ఆమెతో చేరదాం... అని మనసులో ఉన్నా, తప్పక అబ్బాయిలతోనే కలిసి పనిచేస్తుంది.

కట్‌ చేస్తే... కొన్ని రోజులకి ఆఫీసు నిండా రంగురంగుల ఊలుబంతులే! అవి తమకి నచ్చినట్టుగా ఉంటాయి. మగవాళ్లని అనుసరించేందుకు ఏ మాత్రం ప్రయత్నించవు. చివరికి ఒకరి కోసం మనం మారాల్సిన అవసరం లేదని అర్థం చేసుకుంటుంది పర్ల్‌. వర్క్‌ప్లేస్‌లో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులని ఏడునిమిషాల్లో చూపించిన సినిమా ఇది. క్రిస్టెన్‌ లెస్టర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆమె స్వీయ అనుభవంలోంచి వచ్చినదే. యానిమేషన్‌ టీమ్‌లో ఒకే ఒక్క అమ్మాయిగా పనిచేసినప్పుడు దర్శకురాలు క్రిస్టెన్‌ చాలా ఇబ్బందిపడేదట. ఒంటరిగా ఉండలేక, అబ్బాయిలతో కలవలేక.. ఆ అనుభవం నుంచి వచ్చిందే ఈ పర్ల్‌. ఈ సమ్మర్‌లో ఈ చిట్టిసినిమాని మీరు చూడండి, పిల్లలకి చూపించండి. ఒకరిని అనుకరించడం వల్లకాకుండా వైవిధ్యంగా ఉండటం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్