Hero HF Deluxe: హీరో కొత్త HF డీలక్స్‌.. USB ఛార్జర్‌ ఆప్షన్‌తో

Hero HF Deluxe launched: హీరో నుంచి కొత్త హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌ బైక్‌ విడుదలైంది. కొత్త హంగులతో అధునాతన ఫీచర్లతో ఈ బైక్‌ వస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని షోరూమ్‌లలో ఈ బైక్ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

Published : 03 Jun 2023 15:49 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ హీరో మోటోకార్ప్‌ (Hero moto corp) కొత్త హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌ (HF deluxe)ను లాంచ్‌ చేసింది. కొత్త హంగులు, మెరుగైన ఫీచర్లతో ఈ బైక్‌ను తీసుకొచ్చింది. ఇందులో కిక్‌ వేరియంట్ ధర రూ.60,760 (ఎక్స్‌-షోరూమ్‌)  నుంచి ప్రారంభం కానుండగా.. సెల్ఫ్‌ స్టార్ట్‌ వేరియంట్‌ ధర రూ.66,408 నుంచి ప్రారంభమవుతుంది. కొత్త వేరియంట్లు  దేశవ్యాప్తంగా అన్ని హీరో మోటోకార్ప్ షోరూముల్లో లభ్యమవుతాయని కంపెనీ తెలిపింది.

కొత్త హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌ బైక్‌ నెక్సస్‌ బ్లూ, క్యాండీ బ్లేజింగ్‌ రెడ్‌, హెవీ గ్రే విత్ బ్లాక్‌, బ్లాక్‌ విత్‌ స్పోర్స్ట్‌ రెడ్‌ రంగుల్లో లభ్యమవుతుంది. ఈ నాలుగు రంగులతో పాటు కాన్వాస్‌ బ్లాక్‌ పేరిట కొత్త ఎడిషన్‌నూ కంపెనీ లాంచ్‌ చేసింది.  కాన్వాస్‌ ఎడిషన్‌ బైక్‌ పూర్తిగా నలుపు రంగు థీమ్‌తో వస్తోంది. ఫ్యూయల్‌ ట్యాంక్‌, వీల్స్‌, ఇంజిన్‌ ఇలా.. అన్నీ నలుపు రంగులోనే ఉంటాయి. నలుపు రంగు ప్రియుల కోసం ఈ ఎడిషన్‌ను కంపెనీ తీసుకొచ్చింది.

ఇక కొత్త హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌ ఫీచర్ల విషయానికొస్తే.. సెల్ఫ్, సెల్ఫ్‌ ఐ3ఎస్‌ వేరియంట్లలో ట్యూబ్‌లెస్‌ టైర్లతో ఈ బైక్‌ వస్తుంది. యూఎస్‌బీ ఛార్జర్‌ సదుపాయం ఉంది. అయితే, ఇది వినియోగదారుడి ఆప్షన్‌ మేరకు ఏర్పాటు చేస్తారు. సైడ్‌ స్టాండ్‌ ఇంజిన్‌ కటాఫ్‌, కటాఫ్‌ ఎట్‌ ఫాల్‌ వంటి ఫీచర్లతో పాటు ముందూ వెనుక డ్రమ్‌ బ్రేక్స్‌ను అమర్చారు. ఇందులో 97.2 సీసీ ఎయిర్‌కూల్డ్‌ సింగిల్‌ ఇంజిన్‌ సిలిండర్‌ను అమర్చారు. ఇది 9 పీఎస్‌ పవర్‌ను, 8ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 4 స్పీడ్‌ గేర్‌బాక్స్‌ ఉంది. 9.6 లీటర్ల ఫ్యూయల్‌ ట్యాంక్‌, 165ఎంఎం గ్రౌండ్‌ క్లియరెన్స్‌తో ఈ బైక్‌ వస్తోంది. ఈ బైక్‌ బరువు 110-112 కిలోలుగా కంపెనీ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని