PSU Bonds: భారత్‌లో AAA రేటింగ్‌ ఉన్న ప్రముఖ PSU బాండ్లు ఇవే..

భారత్‌లో లాభదాయకమైన రాబడిని అందించే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థ(PSU)లు జారీచేసిన బాండ్లను ఇక్కడ చూడండి.

Published : 08 Jan 2024 22:42 IST

దీర్ఘకాలిక సంపద సృష్టిలో పెట్టుబడి అనేది ఓ ముఖ్యాంశం. ఈక్విటీ, ఇతర మార్కెట్ పెట్టుబడులలో రిస్క్‌ ఉంటుంది. సురక్షిత పెట్టుబడుల విషయానికొస్తే, ఎఫ్‌డీలు మంచివే గానీ ఎల్లప్పుడూ ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడిని ఇవ్వలేవు. రాబడి మెరుగ్గా ఉండి, రిస్క్‌ ఇష్టం లేని పెట్టుబడిదారులకు పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌ టేకింగ్‌(PSU) బాండ్స్‌ కాస్త ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి 10-15 సంవత్సరాల కాలవ్యవధిలో లభిస్తాయి. భారత ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రభుత్వ రంగ సంస్థల్లో కనీసం 51% లేదా అంతకంటే ఎక్కువ వాటాలను కలిగి ఉంటాయి. PSU బాండ్లపై వడ్డీ చెల్లింపులు వార్షికంగా/అర్ధ వార్షికంగా ఉంటాయి. బాండ్లు మెచ్యూరిటీ తేదీకి అసలు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తాయి. అయితే, పెట్టుబడి పెట్టే ముందు క్రెడిట్‌ రేటింగ్‌, వడ్డీ రేటు వంటి కొన్ని ముఖ్యమైన విషయాలను తనిఖీ చేయాలి. 

'AAA' క్రిసిల్‌ రేటింగ్‌తో పాటు, 8% దాటి వడ్డీ రేటు ఇచ్చే బాండ్లను కింది పట్టికలో చూడండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని