Akasa Air: వచ్చే ఏడాది నాటికి ఆకాశ ఎయిర్‌లో 1000 ఉద్యోగాలు భర్తీ

Akasa Air: కొత్తగా విమానరంగంలో తన సేవలను ప్రారంభించిన ఆకాశ ఎయిర్ భారీ సంఖ్యలో నియామకాలను చేపట్టనున్నట్లు ప్రకటించింది.

Published : 24 Mar 2023 23:20 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా కొత్తగా విమాన సేవలు ప్రారంభించిన ఆకాశ ఎయిర్‌ (Akasa Air) దాదాపు వెయ్యి ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు  ప్రకటించింది. 2024 మార్చి నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలిపింది. తద్వారా సిబ్బంది సంఖ్య 3 వేలకు పెరుగుతుందని తెలిపింది. అలాగే తన విమానాల సంఖ్యను, మార్గాలను సైతం విస్తరిస్తామని పేర్కొంది. విదేశీ ప్రయాణాలను ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభించే యోచనలో ఉన్నట్లు సంస్థ సీఈవో వినయ్‌ దూబే పేర్కొన్నారు.

ఆకాశ ఎయిర్‌ 72 బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలకు ఆర్డర్‌ పెట్టింది. అందులో 19 విమానాలతో తమ వాణిజ్య కార్యకలాపాలను కంపెనీ శ్రీకారం చుట్టింది. ఏప్రిల్‌లో తన 20వ విమానం అందుబాటులోకి రానుంది. దీంతో విదేశీ ప్రయాణాలకు ఆ సంస్థ అర్హత సాధిస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి మరో 9 విమానాలను అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ప్రస్తుతం రోజుకు 110 విమానాలకు ఆకాశ ఎయిర్‌ నడుపుతోంది. ఇప్పటికే తమ వద్ద 2 వేలమందికి పైగా ఉద్యోగులు ఉన్నారని, వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఆ సంఖ్యను 3 వేలకు పెంచనున్నామని దూబే తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని