Anant Ambani - Radhika Merchant: రూ.25 కోట్ల విలువైన కార్లతో కాన్వాయ్‌.. అనంత్‌-రాధిక వీడియో వైరల్

Anant Ambani - Radhika Merchant: అనంత్-రాధిక ప్రీవెడ్డింగ్ అయినా, షాపింగ్ చేసినా.. నెటిజన్ల దృష్టి మాత్రం వారిపైనే ఉంటుంది. తాజాగా వారి దుబాయ్‌ పర్యటన చిత్రాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. 

Published : 08 Apr 2024 17:53 IST

ముంబయి: ఇటీవలే అట్టహాసంగా నిర్వహించిన ప్రీవెడ్డింగ్ వేడుకలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది అంబానీ కుటుంబం. ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ- రాధికా మర్చంట్ కొన్ని నెలల్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ సమయంలో వారి విలాసవంతమైన లైఫ్‌స్టైల్‌కు చెందిన కొన్ని దృశ్యాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. (Anant Ambani - Radhika Merchant)

అనంత్‌ జంట ఇటీవల దుబాయ్‌లో షాపింగ్ చేస్తూ కనిపించారు. ఫుల్ సెక్యూరిటీ కవర్‌లో మాల్‌కు వచ్చి షాపింగ్ చేశారు. ఆ లగేజీ తెచ్చుకోవడానికి వారు సుమారు రూ.25 కోట్ల విలువైన కార్ల కాన్వాయ్‌ను వినియోగించడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ వాహన శ్రేణిలో రోల్స్‌రాయిస్‌ కలినాన్‌ బ్లాక్ బ్యాడ్జ్‌తో పాటు పలు లగ్జరీ కార్లు ఉన్నాయి. అలాగే అత్యవసర వైద్య సదుపాయం కోసం ఆ వాహనాల వరుసలో ఒక అంబులెన్స్ కూడా ఉంచడం గమనార్హం.

7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్‌ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?

రిలయన్స్ న్యూ ఎనర్జీ విభాగానికి నేతృత్వం వహిస్తోన్న అనంత్‌కు రాధికతో కొన్నేళ్ల నుంచి పరిచయం ఉంది. 2022లో అధికారికంగా ఇరు కుటుంబాలు వీరి వివాహాన్ని ధ్రువీకరించాయి. 2023 జనవరిలో నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది జులైలో వివాహం జరగనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు