BPCLతో ఏథర్‌ జట్టు.. ఇక బంకుల్లో ఛార్జింగ్‌ పాయింట్లు

Ather Energy ties with BPCL: పెట్రోల్‌ బంకుల్లో ఛార్జింగ్‌ పాయింట్ల ఏర్పాటుకు ఏథర్‌ ఎనర్జీ బీపీసీఎల్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

Published : 28 Jul 2023 20:14 IST

దిల్లీ: ప్రముఖ విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ ఏథర్‌ ఎనర్జీ (Ather Energy) ప్రభుత్వరంగ చమురు సంస్థ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (BPCL)తో కీలక భాగస్వామ్యం కుదుర్చుకుంది. తన ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ విస్తరణ కోసం పెట్రోల్‌ పంపుల్లో ఛార్జింగ్‌ మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న బీపీసీఎల్‌ నెట్‌వర్క్‌ పరిధిలో ఉన్న 21 వేల ఛార్జింగ్‌ స్టేషన్లలో పబ్లిక్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ గ్రిడ్‌ల ఏర్పాటుకు ఏథర్‌కు వీలు కలగనుంది. ప్రస్తుతం వంద నగరాల్లో 1400కు పైగా ఛార్జింగ్‌ గ్రిడ్‌లను ఏథర్‌ ఎనర్జీ ఏర్పాటు చేసింది.

ఎల్‌ఐసీ నుంచి కొత్త టర్మ్‌ ప్లాన్‌.. ప్రీమియం డబ్బులు వెనక్కి

బీపీసీఎల్‌తో భాగస్వామ్యం ద్వారా దేశవ్యాప్తంగా ఫాస్ట్‌ ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు వీలు పడుతుందని ఏథర్‌ ఎనర్జీ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ రవ్‌నీత్ ఫోక్లా ఓ ప్రకటనలో తెలిపారు. ఛార్జింగ్‌ మౌలిక సదుపాయాలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఉపయోగపడుతుందని, తద్వారా విద్యుత్‌ వాహనాల వృద్ధికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. 2040 నాటికి నెట్‌ జీరో లక్ష్యాలను చేరుకోవడానికి బీపీసీఎల్‌ తన వంతు కృషి చేస్తోందని బీపీసీఎల్‌ నార్త్‌ రిటైల్‌ హెడ్‌ రాజీవ్‌ దుత్తా ఈ సందర్భంగా తెలిపారు. 7 వేల ఎనర్జీ స్టేషన్ల ఏర్పాటు లక్ష్యానికి తాము చేరువవుతున్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని