FD Rates: ‘తిరంగా ప్లస్‌’ వడ్డీ రేటు తగ్గింపు.. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా లేటెస్ట్ వడ్డీ రేట్లు ఇవే..

Bank of baroda FD Rates: బ్యాంకు ఆఫ్‌ బరోడా ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను సవరించింది. సవరించిన వడ్డీ రేట్లు అక్టోబర్‌ 9 నుంచి అమల్లోకి వచ్చాయి.

Published : 09 Oct 2023 17:31 IST

దిల్లీ: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (Bank of baroda) రూ.2 కోట్ల వరకు విలువగల ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను సవరించింది. 2-3 ఏళ్ల కాలవ్యవధుల ఎఫ్‌డీలపై 20 బేసిస్‌ పాయింట్లను పెంచి అత్యధికంగా 7.25% వడ్డీని అందిస్తోంది. సాధారణ డిపాజిటర్లు 7-14 రోజుల ఎఫ్‌డీపై 3% కనీస వడ్డీని పొందనుండగా.. 2-3 సంవత్సరాల ఎఫ్‌డీపై 7.25 గరిష్ఠ వడ్డీ పొందుతారు. సీనియర్‌ సిటిజన్లకు అన్ని కాలవ్యవధుల ఎఫ్‌డీలపై 0.50% అదనపు వడ్డీ లభిస్తుంది. అయితే, 399 రోజుల కాలవ్యవధి గల ‘బరోడా తిరంగా ప్లస్‌’ డిపాజిట్‌ స్కీమ్‌పై వడ్డీ రేటును 7.25% నుంచి 7.15%కు తగ్గించారు. సవరించిన వడ్డీ రేట్లు 2023 అక్టోబర్‌ 9 నుంచి అమల్లోకి వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని