Train ticket: IRCTCలో కొత్త సదుపాయం.. ట్రైన్‌ టికెట్‌కూ EMI

ఇ-కామర్స్‌ వేదికలపై లభించే EMI సదుపాయం ఐఆర్‌సీటీసీలోనూ (IRCTC) అందుబాటులోకి వచ్చింది. వస్తువును కొని ఈఎంఐ పద్ధతిలో ఎలాగైతే చెల్లింపులు చేస్తున్నామో.. ఇకపై ట్రైన్ టికెట్లూ అదే మాదిరిగా కొనుగోలు చేయొచ్చు.

Published : 20 Oct 2022 19:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇ-కామర్స్‌ వేదికలపై లభించే EMI సదుపాయం ఐఆర్‌సీటీసీలోనూ (IRCTC) అందుబాటులోకి వచ్చింది. వస్తువును కొని ఈఎంఐ పద్ధతిలో ఎలాగైతే చెల్లింపులు చేస్తున్నామో.. ఇకపై ట్రైన్ టికెట్లూ అదే మాదిరిగా కొనుగోలు చేయొచ్చు. ఇందుకోసం ‘ఇప్పుడు ప్రయాణించండి.. తర్వాత చెల్లించండి’ (Travel now pay later- TNPL) సేవలను తాజాగా ఐఆర్‌సీటీసీ ప్రారంభించింది. ఇందుకోసం క్యాష్‌ఈ (CASHe) సంస్థతో జట్టుకట్టింది. రైల్వేకు చెందిన ఐఆర్‌సీటీసీ రైల్‌ కనెక్ట్‌ యాప్‌లో ఈ సేవలు లభ్యమవుతాయి.

ప్రయాణికులు ఇకపై టికెట్‌ బుక్‌ చేసుకున్నాక టికెట్‌ మొత్తాన్ని వాయిదా పద్ధతిలో చెల్లించొచ్చు. 6 లేదా 8 వాయిదాల్లో ఈ మొత్తాన్ని చెల్లించే వెసులుబాటును కల్పిస్తున్నారు. సాధారణ, తత్కాల్‌ టికెట్‌ బుకింగ్‌ సమయంలో క్యాష్‌ఈ ఈఎంఐ సేవలను పొందొచ్చు. యాప్‌ వాడే వారందరూ ఆటోమేటిక్‌గా ఈ సదుపాయాన్ని పొందొచ్చని, దీనికి ఎలాంటి డాక్యుమెంటేషన్‌ అవసరం లేదని క్యాష్‌ఈ ఓ ప్రకటనలో తెలిపింది. ముందుగా కొంతమొత్తం చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఈఎంఐగా మార్చుకోవడం లేదా టికెట్‌ ధర మొత్తాన్నీ ఈఎంఐగా మార్చుకునే వీలుంది. మొత్తం, కాలవ్యవధి ఆధారంగా వడ్డీ రేటు వర్తిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని